twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి వాళ్ల వల్లే చిన్నగా కనిపిస్తున్నా.. అందుకే సినిమా ఫంక్షన్లలో తలదించుకుంటా: పవన్

    |

    ప్రముఖ సంపాదకుడు, రచయిత తెలకపల్లి రవి రాసిన 'మన సినిమాలు.. అనుభవాలు.. చరిత్ర.. పరిణామం' పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌తో పాటు సినీ ప్రముఖులు తనికెళ్ళ భరణి, పరుచూరి గోపాలకృష్ణ, సుద్దాల అశోక్ తేజ, రావి కొండల రావు, సినీ పాత్రికేయుడు రెంటాల జయదేవ విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో పుస్తకాలు, రచనల, రచయితల గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

    ఈ సందర్భంగా ప్రస్తుత సమాజంలో ఉన్న రచయిల గురించి మాట్లాడుతూ.. 'మన సమాజంలో రచయితల రూపంలో ఎంతో మంది గొప్పవాళ్లు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను చూస్తున్నప్పుడల్లా నాకు అపారమైన గౌరవం ఉంటుంది. వాళ్ల ముందు నేను చాలా తగ్గిపోతూ ఉంటాను. అందుకే ఎంత మంది నన్ను మెచ్చుకున్నా.. ఎన్ని రకాలుగా నన్ను పైకెత్తినా గానీ నేనెందుకు తగ్గి ఉంటానంటే.. నాకు తెలుసు.. ఒక్కొక్కరి అనుభవం ఎంతుందో. ఎంతో లోతైన విషయ పరిజ్ఞానము.. ఎంతో లోతైన పరిశీలన వాళ్ల ముందు నిజంగా నన్ను చాలా చాలా చిన్నవాడిని చేస్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.

    Pawan kalyan comments on Writters

    అంతేకాదు, 'ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించొచ్చుగానీ లక్షల మెదళ్లను కదిలించగలిగే శక్తి ఉన్న కవులు, రచయితలను ఎదుర్కో వడం చాలా కష్టం. ఎన్నో రక్తపు చుక్కలు కారితే తప్ప ఒక్క వాక్యం కూడా రాయలేమని ఒక ఇంగ్లీష్ కవి చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. అలాంటిది కనిపించని రక్తాన్ని చిందించి లక్షల పేజీలు రాసిన కవులు, రచయితలకు జోహార్లు. ఈ కారణంగానే అలాంటి వ్యక్తుల పట్ల అపారమైన గౌరవం ఉంది. అందుకే సినిమా వేడుకల్లో తల ఎగరేయకుండా వాళ్ల ముందు తలదించుకొని కూర్చుంటాను' అని పవన్ చెప్పుకొచ్చాడు.

    English summary
    Tollywood Hero, Jansena party president Pawan kalyan Launches Telakapalli Ravi’s Mana Cinemalu Book. In This Event Pawan Intresing Comments On All Writters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X