మీసాలు మెలేయడం, తొడ కొట్టడం వంటి వాటికి తాను వ్యతిరేకమని సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. కడప జిల్లా రాజంపేట పాత బస్టాండు సర్కిల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మీసాలు మెలేయటం, తొడలు కొట్టమని పీఆర్ పీ, చిరు, పవన్ అభిమానులు పదేపేదే కోరటంతో ఆయన్ను కోరడంపై పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా ఇదే విధంగా అందరూ కోరుతున్నారని, అయితే తాను వాటికి విరుద్దమని, మీసాలు మెలేయటం, తొడలు కొట్టడం పౌరషానికి చిహ్నాలా అని ఆయన ప్రశ్నించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ చేయటమే తన లక్ష్యమన్నారు. తొలి విడతలో 70 స్ధానాలు సాధించంటంతో, ఇక రెండో విడుతలో సాధించ బోయే స్ధానాలతో తమ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. వైయస్, బాబుల అవినీతిని ప్రశ్నించే గుండె ధైర్యం తనకు ఉందని గుండెను గుద్దుకుని పవన్ చెప్పారు.
Story first published: Friday, April 17, 2009, 17:58 [IST]