టాప్-5లో పవన్ కళ్యాణ్ కమ్యూనిటీ
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ విస్తాంగా అందుబాటులో వచ్చాక సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కూడా అభిమాను జోరు పెరిగి పోయింది. తమ అభిమాన స్టార్ పేరుతో కమ్యూనిటీలుగా ఏర్పడి తమ అభిమానాన్ని చాటు కోవడం మొదలు పెట్టారు. గూగుల్ కు అనుబంధమైన ఆర్కుట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో... 'Power Star Pawan Kalyan' పేరుతో ఉన్న కమ్యూనిటీ దేశంలోనే అత్యధిక మెంబర్స్ ఉన్న టాప్-10 కమ్యూనిటీల్లో 2వ స్థానం దక్కించుకుని రికార్డులకెక్కింది.
ఒకప్పుడు చాలా యాక్టివ్ గా ఉండే ఆర్కుట్ ఇప్పుడు కాస్త వెనకబడినప్పటికీ..... ప్రస్తుతం బాగా ప్రచారంలో ఉన్న ఫేస్ బుక్, గూగుల్ ప్లస్ లాంటి సోషనల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ పవన్ స్టార్ అభిమానులు తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఫేస్ బుక్ చాలా యాక్టివ్ గా ఉన్నారు.
పవర్ స్టార్ సినిమాల విషయానికొస్తే...
గబ్బర్ సింగ్ తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో 'సరదా'(తాత్కాలిక టైటిల్) చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ నెలలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్‍గా చేస్తోంది. సెకండ్ హీరోయిన్ ను తీసుకునే యోచనలో కూడా ఉన్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈచిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు.


Click it and Unblock the Notifications











