twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అణచివేయబడ్డ పరిస్థితులే ఆయన ఆయుధాలు.. మాదాల రంగారావు గురించి పవన్ కళ్యాణ్!

    |

    రెడ్ స్టార్ మాదాల రంగారావు మృతి పట్ల టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా సంతాపం తెలియజేస్తున్నారు. ఆదివారం తెల్లవారు జామున మాదాల రంగారావు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ఇప్పటికే పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేసారు. శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆయన కొంత కాలంగా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. చివరకు ఆయన నేడు తుది తుది శ్వాస విడిచారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మా అసోసియేషన్ సభ్యులు మాదాల మృతి పట్ల సంతాపం తెలియజేసారు.

    అభ్యుదయ భావాలతో

    అభ్యుదయ భావాలతో

    నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో మాదాల రంగారావు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన మృతి చెందారని తెలిసి చాలా భాదపడ్డానని పవన్ కళ్యాణ్ అన్నారు. 80 లలో రంగారావు అభ్యుదయ భావాలతో తెరకెక్కించిన చిత్రాలు సమాజంలోకి పరిస్థితులకు అద్ధం పట్టాయని పవన్ అన్నారు.

    తెలుగు తెరపై తనదైన ముద్ర

    తెలుగు తెరపై తనదైన ముద్ర

    యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, స్వరాజ్యం, విప్లవ శంఖం వంటి చిత్రాలతో తెలుగు తెరపై మాదాల రంగారావు తనదైన ముద్ర వేశారని పవన్ అన్నారు. ఆయన చిత్రాలు విప్లవాత్మక ధోరణిలో సాగుతాయి. పాటలు కూడా ఆలోచింపజేసేవిగా ఉంటాయని పవన్ అన్నారు.

     అణచివేత ధోరణులే

    అణచివేత ధోరణులే

    సమాజంలోని అణచివేత ధోరణులు మాదాల రంగారావు సినిమాలకు ఆయుధాలు అని చెప్పొచ్చు. అవినీతి, నాయకుల అణచివేత ధోరణి, నిరుద్యోగం వంటి అంశాలతో మాదాల చిత్రాలు చేసారు. ఆయన కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నానని, మాదాల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.

    మా అసోసియేషన్ సంతాపం

    మా అసోసియేషన్ సంతాపం

    మాదాల రంగారావు మృతి పట్ల మా అసోసియేషన్ సంతాపం తెలియజేసింది. మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా, నటుడు నరేష్ మాదాల మృతికి సంతాపం తెలియజేశారు.

    English summary
    Pawan Kalyan Condolence To Madala Ranga Rao. Sivaji Raja and Naresh also Condolence To Madala Ranga Rao
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X