ఎంత బిజీగా ఉన్నా అది మాత్రం మరువలేదు.. జయప్రకాష్ మృతిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్
తెలుగు చిత్ర సీమలో విలక్షణ నటుడైన జయప్రకాష్ రెడ్డి నేడు (సెప్టెంబర్ 8) మరణించారు. తెల్లవారు ఝామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. భీకరమైన రూపంతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన జయప్రకాష్ రెడ్డి ఆపై కడుపుబ్బా నవ్వించారు. ఇలా విలనిజాన్ని, కామెడీని అద్భుతమైన రితిలో పండించం కేవలం జయప్రకాష్ రెడ్డి వల్లే సాధ్యమవుతుంది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే జయప్రకాష్ మృతి పట్ల రవితేజ, సాయి ధరమ్ తేజ్, రామ్, ఎన్టీఆర్, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, వెన్నెల కిషోర్, బండ్ల గణేష్, మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, ప్రకాష్ రా, వెంకటేష్, కోన వెంకట్, గోపీ మోహన్, వివి వినాయక్, నాగబాబు ఇలా ఎంతో మంది స్పందించారు. జయప్రకాష్ రెడ్డితో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు.

ప్రముఖ నటులు జయప్రకాష్ రెడ్డి గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. జయప్రకాష్ రెడ్డి గారి కుటుంబానికి నా తరుపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
రాయల సీమ మాండలికాన్ని పలకడంలో తనదైన బాణీని చూపారు. నాటక రంగం నుంచి వచ్చిన ఆయన ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల్ని మెప్పించారు. గబ్బర్ సింగ్‌లో పోలీస్ కమిషనర్‌గా ఆయన నటించారు. పాత్ర ఏదైనా చక్కగా ఒదిగేపోయేవారు. చిత్ర రంగంలో ఎంత బిజీగా ఉన్నా నాటక రంగాన్ని మాత్రం మరువలేదు. తెలుగు సినీ, నాటక రంగాలకు ఆయన లేని లోటు తీరనిది అంటూ పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.


Click it and Unblock the Notifications











