ఆమె పేరు చెబితే అదే గుర్తుకు వస్తుంది.. అప్పటి నుంచి పరిచయం.. గీతాంజలి మృతిపై పవన్ సంతాపం
Recommended Video
ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆలరించిన ప్రముఖ నటి గీతాంజలి మృతి చెందారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న గీతాంజలి.. గురువారం ఉదయం తెల్లవారు జామున గుండెపోటుతో హైదరాబాద్ అపోలో హస్పిటల్‌లో కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమెను ఈ సందర్భంగా ఎంతో మంది స్మరించుకుంటున్నారు.

ఆమె మరణం ఎంతో బాధాకరం..
గీతాంజలి మృతి పట్ల సినీ నటుడు, జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ సంతాపాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశాడు. ప్రముఖ నటి గీతాంజలి గారి మరణం ఎంతో బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మన తెలుగు సినీ రంగంలోని సీనియర్ నటుల్లో గీతాంజలి గారు ఒకరు.
ఆ పాట గుర్తుకు వస్తుంది..
ఆ పేరు చెబితే ‘సీతారామ కళ్యాణం'లోని శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి.. పాటలోని సీతాదేవీ గుర్తుకువస్తుంది. తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన గీతాంజలి గారు వినోద ప్రధానమైన పాత్రల్లో తనదైన ముద్రను కనబరిచారు. మేము చెన్నైలో ఉన్నప్పుడు గీతాంజలి గారికి చెందిన శ్రీనివాస థియేటర్లో వారి కుటుంబ సభ్యులను కలుస్తుండేవాళ్లం.

ప్రగాఢ సానుభూతి..
హైదరాబాద్ వచ్చాక ఆ పరిచయం కొనసాగింది. వారి కుటుంబ సభ్యులకు నా తరుపున, జనసేన తరుపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నటి గీతాంజలికి యాక్టర్ రామకృష్ణతో వివాహం జరిగింది. పెళ్లికి ముందు వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. వీరిద్దరకి ఆదిత్ శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు.


Click it and Unblock the Notifications











