జెమినీ కిరణ్‌కు పితృవియోగం.. పవన్ కల్యాణ్ ప్రగాఢ సంతాపం!
ప్రముఖ నిర్మాత జెమినీ కిరణ్ తండ్రి పర్వతనేని గోపాలరావు శుక్రవారం (జూన్ 1వ తేదీ) ఉదయం 10.45 నిమిషాలకు తుదిశ్వాస వదిలారు. శనివారం సాయంత్రం 4 గంటలకు జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పితృవియోగంతో బాధపడుతున్న జెమినీ కిరణ్‌ను పలువురు సినీ, రాజకీయ వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రకటన ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు జెమిని కిరణ్ తండ్రి శ్రీ పర్వతనేని గోపాలరావు గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. గోపాలరావు గారికి సినిమా పరిశ్రమతో సత్సంబంధాలున్నాయి. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కిరణ్, ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని అధ్యక్షులు, జనసేన పార్టీ పవన్ కల్యాణ్ పేరిట ఓ ప్రకటన జారీ అయింది.



Click it and Unblock the Notifications











