భాగ్యలక్ష్మి ఎవరు? తికమకలో పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోయిన్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన పక్కన చాన్స్ దక్కితే చాలు అనుకునే హీరోయిన్లు ఎందరో. అయిటే ఇప్పటి వరకు 'పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2' చిత్రానికి హీరోయిన్ ఖరారు కాలేదు. 'గబ్బర్ సింగ్' చిత్రంలో శృతి హాసన్ చేసిన 'భాగ్యలక్ష్మి' పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో 'పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2' సినిమాలో కూడా భాగ్యలక్ష్మి పాత్ర కీలకంగా మారనుంది. అయితే ఈ పాత్రకు మళ్లీ శృతి హాసన్‍నే తీసుకుందామా? లేక కొత్త హీరోయిన్‌తో ఆ పాత్ర చేయిద్దామా అనే తికమకలో ఉన్నారట దర్శకుడు. పవన్ కళ్యాణ్ కూడా హీరోయిన్ విషయంలో ఇప్పటి వరకు ఓ నిర్ణయానికీ రాలేదని సమాచారం. పవన్ కళ్యాణే ఈ పాత్రకు హీరోయిన్ ఎవరనే విషయం ఖరారు చేస్తారని యూనిట్ సభ్యులు అంటున్నారు.
నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లిమిటెడ్ పతాకంపై శరత్ మరార్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ నిర్మాత పవన్ కళ్యాణ్ కు చాలా దగ్గరి సన్నిహితుడు అన్న విషయం మనకు తెలిసిందే. సెప్టెంబర్ నెలాఖరున సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ స్టేజిలో ఉంది. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications












