రామ్ చరణ్.... అండర్ పవన్ కళ్యాణ్ క్రియేటివిటీ..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యూత్‌లో ఇంత క్రేజ్ ఏర్పరచుకోవడానికి కారణం ఆయన నటించిన సినిమాలే. పవన్ నటించిన తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి చిత్రాలు యూత్‌లో ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్ తేవడంతో పాటు పవర్ స్టార్‌ను చేశాయి. అయితే వయసు పైబడుతున్న కొద్దీ రాను రాను అలాంటి సినిమాలు చేయడం వీలు కాదు అనే భావనలో ఉన్నాడట పవర్ స్టార్.
దీంతో పవర్ స్టార్ ఆలోచన రామ్ చరణ్ పైకి మళ్లిందని అంటున్నారు. అలాంటి సినిమాలు చేయడానికి రామ్ చరణ్ అయితే పర్‌ఫెక్టుగా సెట్ అవుతాడనేది పవన్ ఆలోచన. ఆ మధ్య 'ఆరెంజ్' స్టోరీని ఓకే చేసింది పవనే. అయితే అది వర్కౌట్ కాక సినిమా ప్లాప్ అయింది. దీంతో రూట్ మార్చిన చెర్రీ మాస్ మాస్ సబ్జెక్టుల వైపు దృష్టి మళ్లించాడు.
అయితే ఎప్పటికైనా తన ఆలోచనలో చెర్రీతోనే చేయించాలని దృడ నిశ్చయంతో ఉన్న పవన్ భవిష్యత్‌లో తన ఆలోచనలకు కార్యరూపం తేవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవర్ స్టార్ ఆలోచనలు కార్యరూపంలోకి ఎప్పుడు వస్తాయో చూడాలి.
చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు...వివి వినాయక్ దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ చిత్రానికి కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఈచిత్రాల షూటింగ్ ప్రారంభమైంది. మరో వైపు 'జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఈ మెగా పవర్ స్టార్.
పవర్ స్టార్ 'గబ్బర్ సింగ్' చిత్రం తర్వాత చేయబోయే చిత్రం 'కెమెరా మెన్ గంగతో రాంబాబు'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో పవన్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించనున్నారు. తమన్నా హీరోయిన్‌గా ఎంపికయింది.


Click it and Unblock the Notifications











