15 సినిమాలను లైన్‌లో పెట్టిన పవన్ కల్యాణ్: ఆ హీరోలతోనూ కలిసి.. టాలీవుడ్‌లోనే చారిత్రక ఘట్టం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగానే కాకుండా ఒక మంచి మనిషిగా అభిమానులకు దగ్గరయ్యాడు. నిజానికి పవన్ సినిమాల కంటే కూడా అతను చేసిన సహాయాల వల్లే ఎక్కువగా క్రేజ్ వచ్చింది. ఇక రాజకీయంగా కూడా పవన్ తనదైన శైలిలో నడుస్తున్నాడు. అయితే ఆర్థికంగా సపోర్ట్ కోసం పవన్ నిర్మాతగా మరిన్ని సినిమాలను రూపొందించడానికి సిద్ధమయ్యాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సంయుక్తంగా 15సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో
సొంతంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ ను స్థాపించిన పవర్ స్టార్ ఇదివరకే కొన్ని సినిమాలను నిర్మించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో పాటు నితిన్ తో ఛల్ మోహన్ రంగా అనే సినిమాను నిర్మించాడు. అయితే ఆ సినిమాలు అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు. ఇక ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న వినిమాలతో సిద్దమవ్వాలని ఆలోచిస్తున్నారు.

మొత్తం 15 సినిమాలు
సాధారణంగా ఒక హీరోతో మరోక హీరో వర్క్ చేస్తే ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొంటుంది. ఇక పవర్ స్టార్ ప్రొడక్షన్ లో 15 సినిమాలు రూపొందుతున్నాయి అంటే తప్పకుండా అందులో వేరే హీరోలు నటిస్తారు అని క్లారిటీ వచ్చేసింది. పవన్ ఒక్కడే కాకుండా చిన్న హీరోలు అలాగే మీడియం రేంజ్ హీరోలు అగ్ర హీరోలు కూడా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో సినిమాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మూడు బిగ్ బడ్జెట్ సినిమాలు
నిర్మాత విశ్వ ప్రసాద్ తో పవన్ కళ్యాణ్ కు మంచి స్నేహం ఉంది. చాలా రోజులుగా ఈ కాంబినేషన్ లో సినిమా చేయాలని పవన్ ఆలోచిస్తున్నాడు. ఇక మొత్తానికి తన సొంత ప్రొడక్షన్ తో సంయుక్తంగా సినిమాలను నిర్మించేందుకు రెడీ అయ్యారు. 6 చిన్న సినిమాలు, 6 మిడియామ్ బడ్జెట్ సినిమాలతో పాటు మరో మూడు బిగ్ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తారట.

అగ్ర హీరోలతో కూడా..
కొత్త వారికి కూడా ఇందులో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సినిమాల్లో నటించనున్నారట. అయితే పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ లో సినిమాలు చేయబోయే అగ్ర హీరోలు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ అంటే అందరికి ఇష్టమే. సినిమా చేయడానికి తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెప్పవచ్చు. మరి ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో. లాభాలను అందుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











