పవన్ కళ్యాణ్ క్రెడిట్ ని కొట్టేసిన లవర్ బోయ్!
గతంలో పవన్ కళ్యాణ్ కు ఒక మంచి రికార్డ్ ఉండేది. అది ఎలా అంటే 'తొలిప్రేమ" తో కరుణాకరణ్ నీ, 'తమ్ముడు"తో అరుణ్ ప్రసాద్ నీ, 'బద్రి" తో పూరి జగన్నాథ్ నీ, 'ఖుషీ" తో తెలుగు కి ఎస్ జె సూర్యనీ దర్శకులుగా పరిచయం చేసి కంటిన్యూగా నలుగురు కొత్త డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి ఇచ్చారని అందరూ అభినందించారు. ఆ వరుసలో ఐదో సినిమానీ కొత్త దర్శకుడితోనే చేసి షాక్ తిన్నారు పవన్ కళ్యాణ్ వేరెవరో కాదు స్వయంగా 'జానీ" తీసుకున్న పవన్ కళ్యాణే.
అదే బాటలో పయనిస్తున్న మరో హీరో లవర్ బోయ్ సిద్దార్థ్. 'కొంచెం ఇష్ట కొంచెం కష్టం", ఓయ్, 'స్ట్రైకర్" ఇలా ఈ మూడు సినిమాల్నీ కొత్త దర్శకులతోనే చేయగా, ప్రస్తుతం తను చేస్తున్న మరో మూడు సినిమాలు 'బావ", రాఘవేంద్రుని తనయుడు ప్రకాష్ చిత్రం, జయేంద్రన్ డైరెక్షన్ లో ద్విభాషా చిత్రం కూడా కొత్త దర్శకులవే. ఇంతకుముందు కూడా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా" తో ప్రభుదేవా, 'బొమ్మరిల్లు" తోభాస్కర్, 'చుక్కల్లో చంద్రుడు" తో శశి డైరెక్టర్స్ అయ్యారు.
మొత్తానికి తన 13 సినిమాల్లో 9 చిత్రాలు కొత్త డైరెక్టర్స్ తో చేసినవే అని తన ట్విట్టర్ లో ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాడు సిద్దార్థ్. సో పవర్ స్టార్ కొత్త దర్శకుల క్రెడిట్ సిద్దు ఎకౌంట్ లోకి షిప్ట్ అయిపోయినట్టే.


Click it and Unblock the Notifications











