twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాటల్లో కాదు, చేతల్లో సాయం చేయండి: పవన్ (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హుధూద్ తుఫాన్ భాదిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు విమానంలో చేరుకున్న ఆయన...అక్కడి నుండి రాజమండ్రి చేరుకున్నారు. అటు నుండి రోడ్డు మార్గంలో విశాఖ బయల్దేరి వెళ్లారు. రేపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

    ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ....తఫాన్ కారణంగా ఇక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారని ఆధుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాటల్లో కాకుండా, చేతల్లో సాయం చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటించిన రూ. 1000 కోట్ల తక్షణ సహాయం అందించడంపై హర్షం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ తన వంతు సహాయంగా రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

    స్లైడ్ షోలో పవన్ కళ్యాన్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు....

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న దృశ్యం.

    అభిమానులతో కలిసి

    అభిమానులతో కలిసి


    పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సందర్భంగా పలువురు అభిమానులు అక్కడకు చేరుకున్నారు.

    విశాఖలో పర్యటిస్తారు

    విశాఖలో పర్యటిస్తారు


    పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖలో పర్యటిస్తారు. రేపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటిస్తారు.

    రాజమండ్రిలో...

    రాజమండ్రిలో...


    రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతున్న పవన్. ప్రతి ఒక్కరూ తుఫాన్ బాధితులకు సహాయం చేయాలని కోరారు.

    English summary
    Power star Pawan Kalyan has announced a relief fund of 50 lakhs and has specially flown down to Vizag to see the damage that has been caused by the natural calamity. He is currently inspecting the various areas in Vizag city and is also speaking to those concerned.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X