తొలిప్రేమకు పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అప్పట్లోనే రికార్డు మొత్తంలో

Recommended Video

Art Director Anand Sai Talks About Pawan Kalyan Remuneration

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తొలిప్రేమ చిత్రంలో ఆర్ట్ డైరెక్టర్ గా తన పని గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఎన్టీఆర్ తో సింహాద్రి, యమదొంగ వంటి చిత్రాలకు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం. రాజమౌళి క్రమంగా ఎదుగుతూ ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారని అన్నారు.

ఎవరూ నమ్మలేదు

ఎవరూ నమ్మలేదు

తొలిప్రేమ చిత్రంలో ఆర్ట్ డైరెక్టర్ గా నాపై ఎవరూ నమ్మకం ఉంచలేదని ఆనంద్ సాయి తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడే నన్ను నమ్మి అవకాశం ఇచ్చాడని తెలిపారు. సినిమాల్లోకి రాక ముందు నుంచే పవన్, ఆనంద్ సాయి ఇద్దరూ స్నేహితులు.

అప్పట్లో పవన్ రెమ్యునరేషన్

అప్పట్లో పవన్ రెమ్యునరేషన్

తొలి ప్రేమ చిత్రానికి పవన్ కళ్యాణ్ పారితోషకం 15 లక్షలు అని ఆనంద్ సాయి తెలిపాడు. అప్పట్లో 15 లక్షలు చాలా పెద్ద అమౌంట్. తాజ్ మహల్ లాంటి భారీ సెట్ ఇతడు వేయగలడా అని దర్శక నిర్మాతలు అనుమానం వ్యక్తం చేసారు.

డబ్బు వదిలేసుకోవడానికి

డబ్బు వదిలేసుకోవడానికి

ఒకవేళ సెట్ బాగా రాకపోతే నా డబ్బు వెనక్కి తీసేసుకోండి అని పవన్ కళ్యాణ్ నిర్మాతాలతో చెప్పాడు. ఆ మాటలతోనే నాకు ధైర్యం వచ్చింది. బీచ్ లో తాజ్ మహల్ సెట్ వేయడం మామూలు విషయం కాదు. కానీ విజయవంతంగా పూర్తి చేశాను అని ఆనంద్ సాయి తెలిపాడు.

అంతా మంచే

అంతా మంచే

బీచ్ లోనే సెట్ ఉండడం వలన ఒక్కొక్క సారి భారీగా అలలు వచ్చేవి. సెట్ పాడైపోతుందేమో అని టెన్షన్ పడేవాడిని అని ఆనంద్ సాయి తెలిపారు. పవన్ కు ఈ విషయం చెబితే అంతా మంచే జరుగుతుంది అని అన్నారు. అనుకున్న విధంగానే షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని ఆనంద్ సాయి తెలిపాడు.

ఎన్టీఆర్ కత్తి నాదే

ఎన్టీఆర్ కత్తి నాదే

ఎన్టీఆర్ కు కూడా నేనేంటే చాలా ఇష్టం. సింహాద్రి. యమదొంగ చిత్రాలకు పని చేశాను. సింహాద్రి చిత్రంలో ఎన్టీఆర్ ఉపయోగించే కత్తి వెరైటీగా ఉండాలని రాజమౌళి అన్నారు. ఒకరోజు ట్రైన్ లో ప్రయాణిస్తూ ఆ కత్తి స్కెచ్ గీసి రాజమౌళికి ఇచ్చానని ఆనంద్ సాయి తెలిపారు.

యమలోకం

యమలోకం

ఆ తరువాత రాజమౌళి సై, యమదొంగ చిత్రాలకు కూడా పనిచేశా. యమదొంగ చిత్రంలో యమలోకాన్ని చాలా కొత్తగా డిజైన్ చేసాం. రాజమౌళి అంచలంచెలుగా ఎదుగుతూ ఉన్నతస్థాయికి చేరుకున్నారని ఆనంద్ సాయి ప్రశంసించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X