పవన్ కళ్యాణ్-దాసరి మూవీ టైటిల్ అదేనా?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్-దాసరి నారాయణరావు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాసరి నారాయణరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘కల్కి' అనే టైటిల్ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
సినీనటుడు పవన్‌కళ్యాణ్‌తో అక్టోబరు నెలలో సినిమా తీస్తానని దర్శకుడు దాసరి నారాయణరావు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలోని విలేఖరులతో దాసరి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. తారకప్రభు ఫిలిమ్స్ బ్యానర్ లో 37వ చిత్రాన్ని పవన్ తో నిర్మిస్తానంటూ దాసరి ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా దర్శకుడు ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆ దర్శకుడు మరెవరో కాదు... గోపాల గోపాల చిత్రం డైరక్ట్ చేసిన కిషోర్ పార్దసారధి(డాలి) అని తెలుస్తోంది. ఈ మేరకు డాలి స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
సాయి మాధవ్ బుర్రా(గోపాల గోపాల మాటల రచయిత) ఈ స్క్రిప్టు వర్క్ లో పాల్గొని డైలాగులు రాస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, దేవిశ్రీ ప్రసాద్ సంయుక్తంగా సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ లోపు గబ్బర్ సింగ్ 2 పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గబ్బర్ సింగ్-2 చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











