Just In
- 53 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, ఒడిశా, గోవా
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ తో సినిమా...నాలుక కరుచుకున్న దాసరి
హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావు - పవన్ కల్యాణ్ కలసి ఓ సినిమా చేస్తున్నారనే వార్త నిన్న సాయింత్రం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అది రూమర్ అని కొట్టిపారేసే లోగా దానిని ఖరారు చేస్తూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ...దాసరి ఈ విషయాన్ని ఖరారు చేస్తూ పోస్ట్ చేసారు. నా నెక్ట్స్ డైరక్టోరియల్ ప్రాజెక్టు మన పవర్ స్టార్ అని రాసారు. ఇది అభిమానులలో కలకలం పుట్టించింది. దాసరి దర్శకత్వంలో పవన్ సినిమా ఏంటని తలలు పట్టుకున్నారు. అయితే ఈ విషయం గమనించినట్లున్నారు...మరి కాస్సేపటికి దాన్ని ఎడిట్ చేస్తూ...నా నెక్ట్స్ ప్రాజెక్టు పవర్ స్టార్ తో అని పోస్ట్ పెట్టి రిలీఫ్ ఇచ్చారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇంతకీ ఈ కాంబినేషన్ అంతరార్దం ఏమిటీ అంటే... దాసరి - పవన్ కలసి ఓ చిత్రం చేయడానికి నిర్ణయించుకొన్నారు. దాసరి తన నిర్మాణ సంస్థ తారకప్రభు ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాసరి కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తారు.

త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు తెలుపుతారని సమాచారం. దీని పట్ల పవన్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఊహకందని విధంగా ఉంటున్నాయి.
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రానికి దాసరి నారాయణరావు నిర్మాతగా వ్యవహరించనున్నారు. తారకప్రభు ఫిలింస్ బ్యానర్‌పై దాసరి ఈ సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. తారకప్రభు ఫిలింస్ బ్యానర్‌పై 37వ చిత్రంగా పవన్‌కల్యాణ్ సినిమా రానుంది.
ఇలా ఈ విషయాన్ని దాసరి ధ్రువీకరించారు కూడా. అయితే దర్శకుడెవరనేది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం 'గబ్బర్ సింగ్ 2' పనుల్లో బిజీగా ఉన్నారు పవన్. ఆ సినిమా పూర్తయ్యాకే దాసరి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కాంబినేషన్ ఇది. మరి ఈ కలయిక ఇంకెన్ని షాక్‌లను ఇస్తుందో మరి అంటోంది మీడియా.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2′ పనుల్లో బిజీగా ఉన్నారు. శరత్ మరార్ ఈ సినిమాకు నిర్మాత. ‘గబ్బర్ సింగ్ 2′ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇటివలే ‘గోపాల గోపాల' దర్శకుడు డాలీ(కిషోర్) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారు. దాసరి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందో.. అని చర్చ నడుస్తోంది.