పవన్ కళ్యాణ్ కూతురు అంటే అంతే మరి.. ఆద్య ఎలాంటిదో చెప్పడానికి ఇదే ఓ ఉదహరణ!!

పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్‌ల సంతానమే అకీరా నందన్, ఆద్య. అయితే విడాకుల అనంతరం పిల్లలిద్దరూ తల్లితోనే ఉంటున్నారు. విడాకులు అయ్యాక రేణూ దేశాయ్ పిల్లలను తీసుకుని హైద్రాబాద్‌కు దూరంగా వెళ్లి పుణెలో సెటిలైంది. అయితే ఈ మధ్యే షూటింగ్ పనులతో బిజీగా ఉండటం వల్ల హైద్రాబాద్‌లో వచ్చి ఉంటున్నారు. ఇక్కడే ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుక్కున్నారు. దాంట్లోనూ పెద్ద వివాదమే చెలరేగింది. అది వేరే విషయమనుకోండి. తాజాగా ఆద్య గొప్ప మనసు అందరికీ తెలిసేలా రేణూ దేశాయ్ ఓ పోస్ట్ చేసింది.

తల్లిచాటు బిడ్డ..

తల్లిచాటు బిడ్డ..

రేణూ దేశాయ్ అకీరా, ఆద్యలను ఎంత జాగ్రత్తగా పెంచుతూ ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆద్యతో రేణూ దేశాయ్‌కు బాండింగ్ ఎక్కువ. ప్రతీ పోస్ట్‌లో ఆద్య గురించి చెప్పుకొస్తూనే ఉంటుంది. అకీరా సైలెంట్ అని, ఆద్య మాత్రం అలా కాదని గతంలోనే ఎన్నోసార్లు చెప్పింది.

ఫోటోగ్రఫీ స్పెషల్..

ఫోటోగ్రఫీ స్పెషల్..

ఆద్య ఫోటోగ్రఫీలో స్పెషలిస్ట్ అని రేణూ దేశాయ్ ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. తాను షేర్ చేసే ఫోటోలు దాదాపు ఆద్య తీసినవేనని రేణూ దేశాయ్ చెబుతూ ఉంటుంది. ఆద్య బంధించే స్టిల్స్, ఫ్రేమ్స్ ఎంతో బాగుంటాయని కూతురిపై ప్రశంసలు కురిపిస్తుంది. తాజాగా ఆద్య చేసిన ఓ మంచి పని గురించి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో తెలిపింది.

రెండు పిల్లులు..

రెండు పిల్లులు..

ఇంట్లో రెండు పిల్లులు అల్లరి చేస్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా ఓ వీడియోను తీసి రేణూ దేశాయ్ షేర్ చేసింది. వాటికి ఓ కాలు లేదు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెబుతూ వాటి వెనుకున్న కథను వివరించింది. ఆ పిల్లలు అక్కడి ఎలా వచ్చాయో చెప్పుకొచ్చింది.

ప్రమాదంలో గాయపడగా..

ప్రమాదంలో గాయపడగా..

ఆ రెండు పిల్లులు ప్రమాదంలో గాయపడ్డాయని, వాటి కాళ్లు విరిగిపోయాయని చెప్పుకొచ్చింది. అయితే వాటిని రెస్క్యూ కేంద్రం నుంచి ఆద్యయే తెచ్చిందని, అప్పటి నుంచి వాటి బాగోగులను తనే చూసుకుంటోందని చెప్పుకొచ్చింది. ఇంత చిన్న వయసులోనే వాటి పట్ల ఆద్య అంత ప్రేమను కనబర్చుతోంది. పవన్‌కు సైతం మూగ జీవాల పట్ల, ప్రకృతి పట్ల ఎంతో వాత్సల్యం ఉంటుంది.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
మెగా ఈవెంట్లలో..

మెగా ఈవెంట్లలో..

పవన్ కళ్యాణ్‌తో రేణూ దేశాయ్ విడిపోయినా.. పిల్లలు మాత్రం మెగా ఫ్యామిలీకి దూరం కాలేదు. మెగా ఇంట్లో జరిగే కార్యక్రమాలకు పిల్లలిద్దరూ హాజరవుతారు. పైగా ఆద్య, అకీరా అంటే మెగా ఫ్యామిలీ అంతటికీ ఎంతో ప్రియం. దీపావళి, సంక్రాంతి పండుగలకు ఆద్య, అకీరాలు మెగా ఇంట్లో సందడి చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X