పవన్ కళ్యాణ్ కూతురు పేరేమిటంటే...
పవన్ కళ్యాణ్, రేణు దేశై దంపతులు ఆ మధ్యన ఓ ముద్దుల పాపని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆ పాప కి ఆద్య అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ట్వీట్ చేస్తూ చెప్పుకొచ్చారు. పవన్ స్టార్ పవన్..ఈ పుట్టిన రోజుని కూతురు ఆద్యతోనూ, పులితోనూ జరుపుకుంటారని ట్వీట్ చేసారు. అలాగే ఇంతకుముందు పవన్ కి అకిరా అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ కొమురం పులి చిత్రం సెప్టెంబర్ తొమ్మిదిన రిలీజ్ చేయాలని నిర్ణయం చేసారు.
పవన్ కళ్యాణ్ రేణు దేశై ఆద్య అకిరా అల్లు శిరీష్ ట్వీట్టర్ పులి pawan kalyan twitter allu sirish akira aadhya renu desai


Click it and Unblock the Notifications