కూతురు ‘పోలినా అంజని’ ఫోటోతో పవన్ కళ్యాణ్ ట్వీట్.... వైరల్!
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో విప్లవ వీరుడు చేగువేరా విగ్రహం పక్కన పవన్ కూతురు పోలీనా 'చే' ఫోజులో ఉండటం అందరినీ ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్‌కు చేగువేరా అంటే అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నుండి తాను ఎంతో స్పూర్తి పొందానని పలు సందర్భాల్లో పవర్ స్టార్ చెప్పుకొచ్చారు. గతంలో తన సినిమాల్లో కూడా పవర్ స్టార్ చేగువేరా భావజాలాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేశారు.

పవన్ కూతురు కూతురు పోలినా అంజని
నా కూతురు పోలినా అంజని సెయింట్ పీటర్‌బర్గ్ మ్యూజియంలో ‘చే' మైనపు విగ్రహం పక్కన దిగిన ఫోటో ఇది. నేను నెల్లూరులోని విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నపుడు ‘చే' జీవితం గురించి చదివాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏప్పుడో ఒక చోట ఎదో ఒక విధంగా నా జీవితంలోని వస్తూనే ఉన్నాడు. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

విశ్వనరుడు ‘చేగువేరా
‘నేను చేగువేరా జీవితం నుంచి నేర్చుకుంది ముఖ్యంగా ‘ప్రపంచంలో అరాచకం, దోపిడి, నిరంకుశత్వం ఉన్న వ్యవస్థల వల్ల ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నపుడు, నువ్వు ఆ దేశపు మనిషివి కానప్పటికీ, నీకు వ్యక్తిగతంగా ఏమీ జరగనప్పటికీ, నువ్వు పెరిగిన దేశపు, సమాజపు హద్దులను చెరిపేసి ప్రపంచ పీడిత ప్రజలకు అండగా నిలబాలి' అని చెప్పినావాడు, అంతే కాదు జీవితపు అంతిమ క్షణాలు వరకు తాను నమ్మిన సిద్దాంతాన్ని నడిచి చూపించి విశ్వనరుడు ‘చేగువేరా '... అని పవన్ పేర్కొన్నారు.

అర్జెంటీనా నుండి ఉత్తరాంధ్ర వరకు
అందుకేనేమో దశాబ్ధాల క్రితం, ఎక్కడో దక్షిణ అమెరికాలో అర్జెంటీనాలో పుట్టి పెరిగి, క్యూబా, ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాలలో పోరాటాలు చేసిన చేగువేరా ఉత్తరాంధ్రలోని ఓ మూలకి విసిరేసినట్టుండే ఇచ్చాపురంలో స్వేచ్ఛామాత గుడికి వెళ్లే విధికి ఎదురుగా ' ఒక మాదిగ మహనీయుడి చెప్పుల దుకాణంపైన విశ్వనరుడు చేగువేరా ముఖచిత్రం నాకు దర్శనమిచ్చింది' అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.
చే దారిలో పవర్ స్టార్
పీడిత ప్రజలకు అండగా నిలబాలి, జీవితపు అంతిమ క్షణాలు వరకు తాను నమ్మిన సిద్దాంతాన్ని నడిచి చూపించాలనే.... చేగువేరా దారిలోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు.


Click it and Unblock the Notifications