పవన్ కళ్యాణ్ హిట్ కొట్టాలంటే రీమేక్ లే పరమావధి...!
కొమరం పులి" దెబ్బకు భయపడ్డాడో ఏమోగాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్ సినిమాలు అంగీకరిస్తున్నాడు. 'లవ్ ఆజ్ కల్" చిత్రం రీమేక్ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్..తాజాగా 'దబంగ్" రీమేక్ లోనూ నటించేందుకు ఒప్పుకోవడం తెలిసిందే. ఈ చిత్రానికి 'గబ్బర్ సింగ్"అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసేసారు. నిజానికి పవన్ కళ్యాణ్ తిరుగులేని స్టార్ డమ్ ఇచ్చిన చిత్రాలన్నీ రీమేకులే. గోకులంలో సీత", 'సుస్వాగతం", 'తమ్ముడు", 'ఖుషీ", వంటి చిత్రాలన్నీ రీమేకులే. రీమేక్స్ ను అలక్ష్యం చేసి, స్ట్రెయిట్ సబ్జక్ట్ లతో సినిమాలు చేయడం మొదలు పెట్టాకే పవన్ కళ్యాణ్ కెరీర్ కు కష్టాలు మొదలయ్యాయి.
అందుకే, కొన్నాళ్లపాటు రీమేక్ లు మాత్రమే చేయాలని పవన్ ఫిక్స్ అయిపోయినట్లున్నాడు. అందుకు మళ్లీ మొదలు పెట్టాడు వరుస హిట్లకోసం..హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్" చిత్రానికి రీమేక్ 'గబ్బర్ సింగ్"గాను, మరి ఇటీవలే బెల్లంకొండ సురేష్ కొనుగోలు చేసిన 'కావలన్"(బాడీగార్డ్) రీమేక్ లోనూ పవన్ కళ్యాణ్ నటిస్తాడేమో వేచి చూడాలి..


Click it and Unblock the Notifications











