పవన్ ని పవర్ స్టార్ కి బదులు రీమేక్ స్టార్ అంటున్నారా..!?

By Sindhu

పవన్ కళ్యాణ్ కు అసలు ఒరిజినల్ ఆలోచనలే వుండవని, అన్నీ అరువు తెచ్చుకున్న కథలతోనే హిట్లు కొడతాడన్న చెడ్డ పేరు ఇంకా కొనసాగుతోంది, 'సుస్వాగతం", తమ్ముడు", 'ఖుషీ"లతో పాటు 'తీన్ మార్"కూడా రీమేక్ సబ్జెక్టులే కావడంతో పవన్ క్రియేటివిటీ మీద అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. తగుదునమ్మా అంటూ ఇదే సమయంలో 'దబాంగ్"ను 'గబ్బర్ సింగ్"పేరుతో తీయబోతుండడం పవర్ స్టార్ ని రీమేక్ స్టార్ గా చేశాయి...

మినిమం గ్యారెంటీ గురించి ఆలోచించే హీరోలు చేపట్టాల్సిన పద్దతిని తాను అవలంభించడం తగదని పవన్ తెలుసుకోవడానికి 'తీన్ మార్" లా మంచి దృష్టాంతమైంది. పాజిటీవ్ టాక్ వచ్చినా..కలెక్షన్స్ ఆశఆజనకంగా లేకపోవడంతో చతికిలబడ్డ 'తీన్ మార్"లా 'గబ్బర్ సింగ్" కాకుడదని ఆలోచించిన పవన్ ఏకంగా ఈ ప్రాజెక్టునే నిలిపేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పైగా సల్మాన్ ఖాన్ 'దబాంగ్"ను పెక్కుమంది అభిమానులు ఆల్రెడీ చూసేయడం మరో దెబ్బ. ఇకనైనా పవన్ రీమేక్ ప్రయోగాలకు వెళ్లకుండా 'తీన్ మార్" గుణపాఠం నేర్పిందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X