ఫిలిం చాంబర్ వద్ద పవన్ కళ్యాణ్ నిరసన... నాగబాబు, అల్లు అర్జున్, తేజ్ కూడా!

By Bojja Kumar

Recommended Video

ఫిలిం ఛాంబర్ లో పవన్ తో మెగా ఫ్యామిలీ తో భేటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ఫిలిం చాంబర్ వద్ద నిరసనకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు నాగ బాబు, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు చేరుకున్నారు. రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తనపై కుట్రలు చేస్తూ చివరకు ఏ పాపం తెలియని తన కన్న తల్లిని తిట్టించేంత నీచానికి ఒడిగట్టిన సంఘటన వెనక ఉన్న వ్యక్తులు, శక్తులపై ఇప్పటికే ట్విట్టర్ వేదికగా విమర్శల బాణాలు సంధించిన పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం ఫిలిం చాంబర్ వద్దకు తన సోదరుడు నాగబాబుతో కలిసి చేరుకున్నారు.

నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్

నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్

ఫిలిం చాంబర్ వద్ద నిరసన తెలిపేందుకు వచ్చినపవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ సభ్యులతో సమావేశం అయ్యారు. . శ్రీరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయడం, తర్వాత పునరుద్ధరించడం తదనంతరం పరిణామాలపై ఆయన ‘మా' సభ్యులతో చర్చిస్తున్నారు.

 శ్రీరెడ్డి వ్యవహారంలో ఏం జరిగిందని ఆరా

శ్రీరెడ్డి వ్యవహారంలో ఏం జరిగిందని ఆరా

అసలు శ్రీరెడ్డి ఎవరు? ఆమె ఆందోళనకు దిగడానికి గల కారణాలు ఏమిటి? ‘మా' ఆమె పట్ల అలా ఎందుకు ప్రవర్తించింది, సభ్యత్వం విషయంలో జరిగిన గొడవలు ఏమిటి అనే విషయాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా కదిలిన సినీ లోకం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఫిల్మ్ ఛాంబర్ వద్దకు అల్లు అర్జున్, పరుచూరి వెంకటేశ్వరరావు, నరేష్, మెహెర్ రమేష్, సాయి ధరమ్ తేజ్ తదితరులు చేరుకున్నారు.

భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్

భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్

పవన్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక తానున్నానని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించడంపై మెగా కుటుంబం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాస్టింగ్‌ కౌచ్‌ వివాదంలో తనను అనవసరంగా లాగడం, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై భావోద్వేగంతో కూడిన ట్వీట్స్ చేశారు.

వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తాను: పవన్ ఆగ్రహం

వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తాను: పవన్ ఆగ్రహం

‘నాపై ఆరోపణలు చేస్తున్నవారికి, చేయిస్తున్న వారికి అమ్మలు, అక్కలు, కోడళ్లు ఉన్నారు. కానీ వారి ఇంట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. టీఆర్‌పీలు, రాజకీయ లాభాల కోసం వయసైపోతున్న నా 70 ఏళ్ల తల్లిని దూషిస్తున్నారు. మీరంతా టీఆర్‌పీల కోసం షోలు నిర్వహిస్తున్నారు కదా? మంచిది. వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తాను.... అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X