సుమన్ ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ సంతాపం
హైదరాబాద్: కేన్సర్ వ్యాధితో అకాల మరణం చెందిన రామోజీ రావు తనయుడు, బుల్లితెర దర్శకుడు, నటుడు సుమన్ మృతికి పవర్ హీరో కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. 'సుమన్ ఇకలేరు అనే విషయం తనను ఎంతో బాధించిందని, మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి సుమన్, నాకున్న మంచి స్నేహితుల్లో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తి ఇక లేరు అనేది జీర్ణించుకోలేని విషయం' అంటూ పవన్ ఉద్వేగానికి గురయ్యారు.
మరో వైపు నటుడు మోహన్ బాబుతో పాటు పలువరు సినీ ప్రముఖులు సుమన్ భౌతిక కాయాన్ని సందర్శించి రామోజీ రావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సుమన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ వారి కుటుంభ సభ్యులకు సానుభూతి తెలిపారు.
బుల్లి తెరపై మంచి పెరుతెచ్చుకున్న సుమన్ కేన్సర్ వ్యాధి భారిన పడి చికిత్స పొందుతూ మరణించారు. సుమన్ గత కొన్ని సంవత్సరాలుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన వయసు 45 సంవత్సరాలు, ఆయనకు భార్య విజయేశ్వరి మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
1966 డిసెంబర్ 23న జన్మించిన సుమన్ తన చిన్న వయస్సులో మంచి విద్యార్ధిగా పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ కి కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం అందించి సుమన్ సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా నటుడిగా కూడా ఈ టీవీ సీరియల్స్ లో కనిపించి ప్రేక్షకుల మధిలో తనదైన ముద్ర వేసారు.


Click it and Unblock the Notifications











