పవర్ స్టార్ పవన్ తో మళ్లీ ‘జల్సా’
సినిమాల సంఖ్య తక్కువే అయినా పవన్ కళ్యాణ్ సాధించింది మాత్రం ఎక్కువే. కోట్లాది మంది అభిమానులకు ఆయన ఆరాధ్యుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న కారణంగా 'జల్సా" తర్వాత పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఆగమనానికి కాస్త విరామం ఎక్కువైంది.
'జల్సా" చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా వన్ ఆఫ్ ది టాప్ హిట్స్ ఆప్ టాలీవుడ్ అనిపించుకోడానికి ఆ సినిమా పాటలు ఎంతో దోహదపడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పని చేసే అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని విడుదలకి ముందు చెప్పిన దేవిశ్రీప్రసాద్ 'జల్సా" రూపంలో తన కెరీర్ లోనూ, పవన్ కళ్యాణ్ కెరీర్ లోను గుర్తుండిపోయే ఆల్బమ్ కంపోజ్ చేశాడు. సినిమా విడుదలయినా ఇప్పటికీ 'జల్సా" పాటలు తరచుగా ఎఫ్ఎంలో వినిపిస్తూనే వున్నాయి.
పవర్ స్టార్ కి పవర్ ఫుల్ ఆల్భమ్ ఇచ్చిన దేవి మరోసారి అతని సినిమాకి వర్క్ చేయనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ బాబు నిర్మించే చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తాడు. ప్రతి ఏడాదికీ తన పేరిట ఒక రాకింగ్ ఆల్బమ్ వుండేలా తపించే దేవిశ్రీప్రసాద్ వచ్చే ఏడాదిలో పవన్ సినిమాతో అదరగొట్టేస్తాడనే ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. ఈ సందర్భంగా గణేష్ బాబు మాట్లాడుతూ 'పవర్ స్టార్ తో చేయనున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అంచానాలు వెళ్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











