»   »  రజనీ తర్వాత పవన్ కళ్యాణే...అంటున్న నాగబాబు

రజనీ తర్వాత పవన్ కళ్యాణే...అంటున్న నాగబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: దక్షిణాదిన రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి పేరున్న నటుడు పవన్ కళ్యాణే అని చెప్పుకొచ్చారు...పవన్ సోదరుడు నాగబాబు. నేడు నాగబాబు 52వ పుట్టినరోజు సందర్భంగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ ఇపుడు హీరోగా టాప్ స్లాట్ లో ఉన్నాడని తెలిపారు. ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి వచ్చి తన సినిమా కెరీర్ ను నాశనం చేసుకోడని ఆయన స్పష్టం చేసారు.

తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఇటీవల జరిగిన ప్రచారం పూర్తి అవాస్తవం....మాకు అసలు రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ అవ్వాలనే ఆలోచనే లేదు. అయితే అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున ఎన్నికల సమయంలో నేను ప్రచారంలో మాత్రమే పాల్గొంటాను. అందుకు మించి వేరే పొలిటికల్ ఎజెండా నాకు ఏమీ లేదని తేల్చి చెప్పారు.

తాను బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న 'లెజెండ్' సినిమాలో నటిస్తున్న వస్తున్న వార్తలపై నాగబాబు స్పందిస్తూ....ఆ వార్తలు నేనూ విన్నాను, కానీ ఇప్పటి వరకు ఆ సినిమా యూనిట్ సభ్యులు ఎవరూ నన్ను సంప్రదించలేదని ఆయన తెలిపారు.

ప్రస్తుతం నేను సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తూ సంతోషంగా ఉన్నాను. త్వరలో మా అబ్బాయి వరుణ్ తేజ్ హీరోగా తెరంగ్రేటం చేయబోతున్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం. ఈ తరం హీరోకు కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నాయి. కెరీర్లో నిలదొక్కుకునేలా సినిమాలు, పాత్రల ఎంపిక దగ్గరుండి చూసుకోవాలని అనుకుంటున్నాను అని నాగబాబు తెలిపారు.

English summary

 Mega brother Nagababu has openly declared that,'Only Pawan kalyan did it after Rajini Kanth in South India film Industrie.' Naga Babu Condemns News Of Him and Pawan Kalyan Joining TDP.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu