నచ్చలేదని తిరస్కరిస్తే వారి అభిప్రాయాన్ని గౌరవిస్తాను: పవన్ కళ్యాణ్
రొటీన్ గా తమ సినిమా ఫంక్షన్లలో అస్సలు మాట్లాడం ఇష్టం ఉండదు మహేష్, పవన్ కళ్యాణ్ కి. మహేష్ లాగే పొడిపొడిగా రెండు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయే పవన్, నిన్న 'తీన్ మార్" ఆడియో విడుదల వేడుకలో కాస్తంత ఎక్కువగానే మాట్లాడాడు. మొన్నటిక మొన్న 'పులి" సినిమా ఫంక్షన్ లోనూ చాలా ఎక్కువ మాట్లాడిన పవన్, ఆ సినిమా ప్లాప్ తర్వాత కొంచెం డిప్లొమేటిక్ గా మాట్లాడ్డం నేర్చుకున్నాడు. సినిమా కష్టపడి చేయడమే నావంతు, దాన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రేక్షకులదే..నచ్చలేదని తిరస్కరిస్తే వారి అభిప్రాయాన్ని గౌరవిస్తాను..అంటూ తన స్టైల్ కి భిన్నంగా మాట్లాడాడు పవన్. ఇకపై రెగ్యులర్ గా సినిమాలు చేయాలనుకున్నాననీ, అభిమానులకు వీలైనంత దగ్గరగా వుంటాననీ భరోసా ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్.
ఇక కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనం కారణంగా మెగా ఫ్యామిలీకి పవన్ దూరంగా ఉంటున్నాడని వచ్చిన వార్తల్ని ఖండిస్తున్నట్టుగా, అల్లు అరవింద్ దగ్గర్నుంచి చిరంజీవి దాకా..'తీన్ మార్" ఆడియో విడుదల వేడుకలో పవన్ ప్రస్తావించని పేరే లేదు. రాజకీయాల్లో చిరంజీవి తెస్తానన్న మార్సు సంగతేమోగానీ, పవన్ లో మాత్రం మార్పు కొట్టొచ్చినట్టు కన్పించిందని 'తీన్ మార్" ఆడియో విడుదల వేడుకను తిలకించిన చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ మార్పుని కొనసాగిస్తూ సినిమా ప్రమోషన్ కోసం విరివిగా కాకపోయినా కాస్తంత మొహమాటం వీడి మీడియా ముందుకొస్తే, పవన్ అభిమానులకి పండగే కదా..!


Click it and Unblock the Notifications











