సంపత్ పక్కకు... పవన్ డైరెక్షన్లోనే గబ్బర్ సింగ్ -2!
హైదరాబాద్: పవర్ కళ్యాణ్ త్వరలో ‘గబ్బర్ సింగ్-2' చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈచిత్రాన్ని స్వయంగా పవన్ కళ్యాణే డైరెక్ట్ చేయబోతున్నాడట. ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేసిన సంపత్ నంది వేరే ప్రాజెక్టుకు మూవ్ అయ్యాడని సమాచారం. అదే సమయంలో తన ఆలోచనలతో సంపత్ నంది సింక్ అవ్వక పోవడం కూడా ఇందుకు మరో కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈచిత్రానికి తానే దర్శకత్వం వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో గతంలో ‘జానీ' అనే సినిమా వచ్చింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మళ్లీ దర్శకత్వం వైపు రావడం హాట్ టాపిక్ అయింది. అయితే అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ మీద చాలా నమ్మకంతో ఉన్నారు.
'నాక్కొంచెం తిక్కుంది...' అంటూ గబ్బర్ సింగ్‌గా పవన్ కల్యాణ్ చేసిన హంగామా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు 'గబ్బర్ సింగ్'కి రెండో భాగం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 70 కోట్లు అని తెలుస్తోంది. ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. నవంబర్ నుంచి చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.


Click it and Unblock the Notifications