»   » అన్నయ్యతో విబేధాలు: ఖండించిన పవన్ కళ్యాణ్

అన్నయ్యతో విబేధాలు: ఖండించిన పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసినా భారీ గెడ్డంతోనే కనిపిస్తున్నారు. ఇదంతా తన తర్వాతి సినిమా ‘గబ్బర్ సింగ్-2' షూటింగ్ కోసమే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆయన తన పూర్తి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. బెంగుళూరులో రెగ్యులర్ గా జిమ్ చేస్తూ సినిమాలో తన పాత్రకు తగిన విధంగా బాడీ బిల్డ్ చేస్తున్నారు.

ఇటీవల ఈటీవీ 20 వసంతాల వేడుక జరిగిన సందర్భంలో కూడా పవన్ గెడ్డంతోనే కనిపించారు. ఆయన గెడ్డం సంగతి పక్కనపెడితే.....ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. అన్నయ్యకు, తనకు మధ్య విబేధాలు ఉన్నాయన్న వార్తలను ఆయన ఖండించారు. అన్నయ్య చిరంజీవి వల్లనే తాను ఇపుడు ఈ స్థాయికి ఎదిగినట్లు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ టీవీలో ఆగస్టు 22న పవన్ కళ్యాణ్ ప్రసంగానికి సంబంధించిన వీడియో టెలికాస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan dismissed rumours

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మరో మూవీ...
త్వరలో తివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో సింగర్ సునీత నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. పవన్ కళ్యాణ్ పిన్ని పాత్రలో నటింపజేయడానికి త్రివిక్రమ్ ఆమెను ఒప్పించాడని అంటున్నారు. అత్తారింటికి దారేది చిత్రంలో నదియా పాత్రకు త్రివిక్రమ్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారు.... తన రాబోయే సినిమాలో సునీతకు అదే రేంజిలో ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఒప్పించాడట. అదే నిజమైతే.... సునీత అభిమానులకు పండగే.

English summary
Pawan Kalyan dismissed rumours that there is no such rift with Chiru and owed the stardom he is having today is only because of his brother.
Please Wait while comments are loading...