twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పంజా..!?

    By Sindhu
    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో పంజా అనే టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. సంఘమిత్రా ఆర్ట్స్ బ్యానర్ పై నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డలు ఎంతు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ క్యారక్టరైజేషన్ అతని ముందు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. ముంబాయి మాఫీయా నేపద్యంలో ఈ చిత్రం చాలా థ్రిల్లింగ్ గా సాగుతుందట. ఈ సినిమాలో పవన్ క్యారక్టర్ పేరు జాక్సన్ రాబర్ట్ అని విశ్వసనీయ సమాచారం.

    అలాగే తాజా అందిన సమాచారం ప్రకారం మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ డ్యుయెల్ రోల్స్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఓ పాత్ర, ప్రజెంట్ లో ఓ పాత్ర ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ఈ రెండు పాత్రలు అద్భుతంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాన్ తో పాటు అంజలీ లావానియాల మద్య వచ్చే బెల్లీ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందట.

    యువన్ శకంర్ రాజా ఈ పాట కోసం చాలా కేర్ తీసుకుని ట్యూన్స్ చేశాడని సమాచారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ట్రైలర్స్ దీపావళికి విడుదల చేసి నవంబర్ లో ఆడియోను విడుదల చేసి, డిసెంబర్ లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

    English summary
    Power Star Pawan Kalyan “Panja” much awaited Pawan Kalyan’s upcoming movie titled Panja. Now the latest news from sources is that, Pawan Kalyan is playing double role in Panjaa. Sources also says that, one would be in flashback and other in present.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X