twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓయూలో పవన్ దిష్టి బొమ్మ దగ్ధం, పోటాపోటీగా పవన్ ఫ్యాన్స్ ఆందోళన: సీన్ లోకి పోలీసులు..

    |

    పవన్ కల్యాణ్ ఫ్యాన్స్-మహేష్ కత్తి వివాదంలో ఓయూ జేఏసీ ఎంట్రీతో వివాదం మరో మలుపు తిరిగినట్లయింది. శుక్రవారం రాత్రి మహేష్ కత్తిపై పవన్ ఫ్యాన్స్ దాడి చేశారన్న ఆరోపణలతో ఓయూ జేఏసీ భగ్గుమన్నది. యూనివర్సిటీల్లో పవన్ దిష్టిబొమ్మలను దగ్దం చేయాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్మానియాలో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం గమనార్హం.

    పవన్ కల్యాణ్ గారు.. థ్యాంక్స్: దాడిపై కత్తి, శంకర్ జోక్యం, అవసరమైతే మద్దతుగా వస్తా?పవన్ కల్యాణ్ గారు.. థ్యాంక్స్: దాడిపై కత్తి, శంకర్ జోక్యం, అవసరమైతే మద్దతుగా వస్తా?

    Recommended Video

    పవన్ కు 'ఓయూ' వార్నింగ్ ! 'కత్తి' జోలికొస్తే ?
    పవన్ దిష్టి బొమ్మ దగ్దం:

    పవన్ దిష్టి బొమ్మ దగ్దం:

    ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ముందు పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహేష్ కత్తిపై దాడిని ఖండిస్తూ పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్ ను తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.

    పోటాపోటీగా పవన్ ఫ్యాన్స్:

    పోటాపోటీగా పవన్ ఫ్యాన్స్:

    ఓయూ జేఏసీ పవన్ దిష్టి బొమ్మను దహనం చేస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అక్కడికి చేరుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. జై జనసేన, జై పవన్ కల్యాణ్ నినాదాలతో పవన్ ఫ్యాన్స్ కూడా జేఏసీకి పోటీగా మరో ఆందోళనకు తెరదీశారు.

    పోలీసుల ఎంట్రీ..:

    పోలీసుల ఎంట్రీ..:

    సకాలంలో పోలీసులు రావడంతో ఉద్రిక్త పరిస్థితులకు తెరపడింది. ఇరువర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు.

    రోడ్డెక్కనిచ్చేది లేదంటున్న పోలీస్..:

    రోడ్డెక్కనిచ్చేది లేదంటున్న పోలీస్..:


    ఓయూ జేఏసీకి పోటీగా పవన్ ఫ్యాన్స్ కూడా ఉస్మానియాలో ఆందోళనకు సిద్దమవడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు మాత్రం ఎవరిని రోడ్డెక్కనిచ్చేది లేదని చెబుతున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో వర్సిటీలో పోలీసులను మోహరించినట్లు సమాచారం.

    డ్రామా అంటున్న ఫ్యాన్స్:

    డ్రామా అంటున్న ఫ్యాన్స్:

    పవన్ ఫ్యాన్స్ తనపై దాడి చేశారని కత్తి మహేష్ ఆరోపిస్తుంటే అటువైపు నుంచి మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా కావాలని క్రియేట్ చేస్తున్న డ్రామా అని పవన్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.

    మహేష్ కత్తిపై గుడ్లతో దాడి: నిజమా, నాటకమా?

    తగ్గేది లేదంటున్న కత్తి:

    తగ్గేది లేదంటున్న కత్తి:

    మరోవైపు అటు మహేష్ కత్తి కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఇది తన ఆత్మగౌరవ పోరాటమని అందుకోసం తన ప్రాణాలే పోయినా లెక్కచేయనని ఇదివరకే ప్రకటించారు.

    ఇంకెంత దూరమో!:

    ఇంకెంత దూరమో!:


    పవన్ ఫ్యాన్స్-కత్తి వివాదానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడటం మాత్రం కష్టమే అనిపిస్తోంది. 15వ తేదీ వరకు మౌనంగా ఉండమని చెప్పినా.. కత్తి హద్దు మీరాడని కోన వెంకట్ ఇదివరకే ఆరోపించారు. దీంతో పవన్ వైపు నుంచి దీనిపై చొరవ తీసుకోవడానికి ఎవరూ సిద్దంగా ఉన్నట్లు లేరు. వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో ఇది ఇంకెంత దూరం వెళ్తుందోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    English summary
    A group of Osmania JAC leaders and students have burnt an effigy of Janasena President Pawan Kalyan, at Arts college in OU on Friday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X