twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా కూతురు బాధపడుతుంది, ఏమీ చేయలేని పరిస్థితి నాది: పవన్ కళ్యాణ్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Pawan Kalyan Emotional Speech About His Daughter

    సినిమాలను పక్కన పెట్టేసి తన పూర్తి సమయం ప్రజా సేవ కోసమే కేటాయించిన పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పోరాట యాత్ర పేరుతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన విశాఖలో ప్రసంగిస్తూ తన సినిమాలు, కుటుంబం గురించి ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాలు చేయడం కంటే ప్రజా సేవ చేయడమే ఇష్టమని తెలిపారు. మాతో ఉండటం లేదని నా బిడ్డలు బాధ పడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి నాది అని పేర్కొన్నారు.

     ఐదు సినిమాలు చేస్తే వంద సినిమాల ఇమేజ్ వచ్చింది

    ఐదు సినిమాలు చేస్తే వంద సినిమాల ఇమేజ్ వచ్చింది

    నేను బేసిగ్గా నటుడిని కాదు. నటుడిగా చేయబడ్డాను. అది భగవంతుడి నిర్ణయం అయుండొచ్చు. నటుడిగా ఏమీ ఆశించలేదు. చేసిన సినిమాలు కూడా చాలా తక్కువే. ఐదారు సినిమాలు వంద సినిమాలు చేసినంత ఇమేజ్ తీసుకొచ్చాయి. అది భగవంతుడి కృప తప్ప నా కృషి ఏమీ లేదు. దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది... అని పవన్ కళ్యాణ్ అన్నారు.

    నా ఆలోచన అంతా ప్రజాసేవ వైపే

    నా ఆలోచన అంతా ప్రజాసేవ వైపే

    నాకు చిన్నప్పటి నుండి ఏ పని చేస్తున్నా నా ఆలోచన అంతా ప్రజాసేవ వైపే ఉండేది. సినిమాలు నేను ఇష్టంగా చేసింది కాదు... పరిస్థితుల కారణంగా నటుడిని అయ్యాను. అందుకే నేను ఎప్పుడూ నా సినిమా సభలు జరుపుకోలేదు. సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ క్లబ్స్ పెట్టలేదని పవన్ తెలిపారు.

    నా ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి

    నా ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి

    నాకంటూ భగవంతుడు అనుమతి ఇస్తే ఒకరోజు నన్ను ప్రజా క్షేత్రంలో తోస్తాడు లేదా ఇది నాది కాదు అనుకుంటే యోగి మార్గంలోకి వెళ్లిపోతాను. నాకు ఈ రెండు ఆప్షన్లే కనిపించాయి. ఎప్పుడూ సన్యాసి అవుతానో తెలియదు, ఎప్పుడు సంసారి అవుతానో తెలియదు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

    నా కూతురు బాధ పడుతుంది

    నా కూతురు బాధ పడుతుంది

    నా పిల్లలు కూడా అంటూ ఉంటారు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతున్నావని... కానీ నేను ఏమీ చేయలేను. నా కూతురు అలా అడిగినపుడు తనను అక్కున చేర్చుకుని బాధ పడటం, కన్నీరు కార్చడం తప్ప వారితో పాటు ఉండలేను. ప్రజా సేవ కోసమే నేను పూర్తి సమయం గడపాలని నిర్ణయించుకున్నాను. అది నా పరిస్థితి.... అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

    వారితో పోలిస్తే నా బిడ్డలది పెద్ద బాధ కాదు

    వారితో పోలిస్తే నా బిడ్డలది పెద్ద బాధ కాదు

    ఎక్కడో మారు మూల అరకు ప్రాంతంలో ఉండే అడవి తల్లి బిడ్డల బాధతో పోలిస్తే నా బిడ్డలు పడే బాధ పెద్ద బాధ కాదు. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్. ప్రమోషన్స్ వచ్చి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండ్ గా రిటైర్డ్ అయ్యారు. మధ్యతరగతి, పేద ప్రజల బాధలు ఎలాంటివో నాకు తెలుసని పవన్ కళ్యాణ్ అన్నారు.

     ధనవంతుడిని చేశాడు, ఏమీ లేని స్థాయికి తీసుకొచ్చాడు

    ధనవంతుడిని చేశాడు, ఏమీ లేని స్థాయికి తీసుకొచ్చాడు

    నాకు ఏమీ లేని స్థాయి నుండి 25 కోట్ల టాక్స్ కట్టే ధనవంతుడిని చేశాడు. అదే సంపద మీద ఆశ లేకుండా చేశాడు. అజ్ఞాతవాసి ఫెయిల్ అయినపుడు ఆ డబ్బంతా తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. ఇస్తే సక్సెస్ ఇస్తాడే లేకపోతే డబ్బు మీద మమకారంలేని పరిస్థితికి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలని ప్రజాక్షేత్రంలో నిలబెడతాడు. అందుకే నేను ఇపుడు ఇక్కడ ఉన్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

    English summary
    Pawan Kalyan Emotional About his daughter Request. Pawan Kalyan, is an Indian film actor, producer, director, screenwriter, writer, and politician. His film works are predominantly in Telugu cinema. He is the younger brother of popular actor turned politician Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X