Pawan Kalyan సినిమా వేరు.. రాజకీయాలు వేరు.. నాని బలంగా నిలబడే వ్యక్తి... పవన్ కల్యాణ్ ఉద్వేగంగా స్పీచ్
అంటే సుందరానికి ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏ వేడుకల్లోనైనా మీ ఉత్సాహం లేకపోతే.. ఆ వేడుకకు అందం ఉండదు. మీరు ఈ వేడుకకు విశిష్ట అతిథులు. ఈ వేడుకకు వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. నరేష్ వీకే, నదియా, రోహిణికి, నజ్రియా ఇతర నటీనటులందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ..
Recommended Video


నాని బలంగా నిలబడే వ్యక్తి అంటూ
అంటే సుందరానికి వేడుకకు ఆహ్వానించిన నిర్మాతలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. నాని గారి నటనే కాకుండా.. ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. ఆయన బలంగా నిలబడే వ్యక్తి. భగవంతుడు నానికి గొప్ప విజయాలు ఇవ్వాలి. అద్భుతమైన విజయాలు సాధించాలని దేవుడిని కోరుకొంటున్నాను. హీరోయిన్‌గా నటించిన నజ్రియా నజీం ధన్యవాదాలు. ఆమె నటన గురించి అందరూ చెబుతుంటే నాకు కూడా అంటే సుందరానికి సినిమా చూడాలని అనిపిస్తున్నది. ఒక సినిమా ఆలరించాలంటే.. మూలపురుషుడు.. వెన్నముక దర్శకుడు. ఈ సినిమాను అందించిన వివేక్ ఆత్రేయ ధన్యవాదాలు అని పవన్ కల్యాణ్ అన్నారు.

నరేష్ మా ఇంటి పక్కనే అంటూ..
వీకే నరేష్ గారు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. చెన్నైలో మా ఇంటి పక్కనే ఉండేవారు. ఆయన వ్యక్తిత్వం, ఆయన నటన నాకు ఇష్టం. నాతోపాటు అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన నదియా గారికి, అలాగే ఇతర నటీనటులకు మనస్పూర్తిగా అభినందనలు. అంటే సుందరానికి సినిమా ఘన విజయం సాధించి అందరికి మంచి పేరు తేవాలని కోరుకొంటున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

సినిమా వేరు రాజకీయం వేరు..
సినిమా వేరు.. రాజకీయాలు వేరు.. వీకే నరేష్ గారికి విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు. నాకు మరో రకమైన అభిప్రాయం, ఆలోచనలు ఉండొచ్చు. సినిమా వేరు రాజకీయం వేరు అనే స్పష్టత నాకు ఉంది. సినిమా 24 క్రాఫ్టులు కలిస్తే సినిమా. వివిధ భాషల నుంచి నజ్రియా, నదియా లాంటి వాళ్లు వచ్చి నటిస్తుంటారు. వివిధ కులాలు, మతాలు, ప్రాంతాల నుంచి వచ్చి నటిస్తున్నారు. అందుకే తెలుగు సినిమా పరిశ్రమ అంటే గౌరవం అని పవన్ కల్యాణ్ అన్నారు.

మా ఇంట్లో నానికి ఫ్యాన్స్
నాని గారికి మా ఇంట్లో కూడా అభిమానులు ఉన్నారు. కొద్ది నెలల క్రితం మా చెల్లెలు హడావిడిగా వెళ్తుంటే.. ఎక్కడికి అంటే.. నాని సినిమాకు అని చెప్పారు. అప్పుడు నాకు నానికి కూడా మా ఇంట్లో ఫ్యాన్స్ ఉన్నారనే విషయం అర్ధమైంది. నాని మనస్తత్వం, వ్యక్తిత్వం గొప్పది. ఆయన గొప్ప విజయాలు సాధించాలి. దర్శకులు వివేక్ ఆత్రేయ, సంగీత దర్శకులు వివేక్ సాగర్‌కు ధన్యవాదాలు అని చెప్పారు.
భవదీయుడు భగత్ సింగ్ గురించి
మా నిర్మాతలు నవీన్, రవి ప్రకాశ్, దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి త్వరలోనే భవదీయుడు భగత్ సింగ్ చేయబోతున్నాం. భవదీయుడు భగత్ సింగ్ సినిమా గురించి మాట్లాడవద్దని హరీష్‌కు చెప్పాను. నాని సినిమా ఫంక్షన్‌లో నా సినిమా గురించి మాత్రమే మాట్లాడమని చెబితే.. నా మాట వినకుండా భవధీయుడు భగత్ సింగ్ సినిమా గురించి హరీష్ శంకర్ మాట్లాడితే నాకు కోపంగా ఉంది. ఆ విషయం చెప్పకుంటే.. మీరు కోపగించుకొంటారని చెప్పి ఉంటారేమో అని పవన్ కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











