Pawan Kalyan అహంకారంపై మడమ తిప్పని యుద్ధం. పవన్ కల్యాణ్ భావోద్వేగం.. కేసీఆర్, కేటీఆర్‌పై ప్రశంసలు

తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి వచ్చిన అభిమానులకు, నా గుండె చప్పుళ్లైన అభిమానులు, ఆడపడచులకు, ప్రతీ ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన వారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. నాలుగు గంటలుగా అనేక కష్టాలు పడుతున్న వారికి నేను క్షమాపణలు చెబుతున్నాను. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి కేటీఆర్‌ను రామ్ భాయ్ అని పిలచుకొంటాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మా చిత్ర యూనిట్ తరఫున మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు. ఇంకా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

సీఎం చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు

సీఎం చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు

చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఇమడవు. ఇది కళాకారులు కలిసే ప్రాంతం. నిజమైన కళాకారుడికి కులం, మతం పట్టదు. కులాలకు, మతాలకు అతీతంగా చెన్నైలో ఉన్న సినిమా పరిశ్రమను హైదరాబాద్‌కు రప్పించిన రాజకీయ ప్రముఖులు, అప్పటి సీఎం చెన్నారెడ్డి పెద్దలు, ఇంకా ఎంతో మంది సహకారం అందించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఆ బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు అందుకు చిత్ర పరిశ్రమ తరఫును మనస్పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు అని పవన్ కల్యాణ్ చెప్పారు.

తలసాని శ్రీనివాస్‌కు తోడ్పాటు అంటూ

తలసాని శ్రీనివాస్‌కు తోడ్పాటు అంటూ

చిత్ర పరిశ్రమకు ఎలాంటి అవసరం ఉన్నాసరే ఎప్పుడూ ముందుండి, దగ్గరుండే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. చిత్ర పరిశ్రమ అంటే కష్ట, నష్టాలు ఉంటాయి. వాటిని మంచి మనసుతో అర్ధం చేసుకొని తోడ్పాటునందిస్తునందుకు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు. అలాగే వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని పవన్ కల్యాణ్ చెప్పారు.

సినిమా నాకు అన్నం పెట్టింది..

సినిమా నాకు అన్నం పెట్టింది..

సినిమాతోపాటు నేను జనజీవితంలో ఉన్నప్పటికీ.. నాకు సినిమా అన్నం పెట్టింది. సినిమా లేకపోతే నాకు ఉనికి ఉండేది కాదు. సినిమా ఇచ్చిన భిక్ష నాకు ఇంతమంది అభిమానులు. నేను ఏదో అయిపోతాననే ఆశలేదు కానీ.. దేశానికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రాలకు, ప్రజలకు అంతో ఇంతో చేయాలనే కోరిక ఉంది. మరో వృత్తి నాకు తెలియదు. డబ్బు సంపాదించుకోవడానికి నాకు సినిమాలో నటించడమే తెలుసు. రాజకీయాల్లోకి ఉన్నందున సినిమాను చాలా బాధ్యతగా చేస్తున్నాను. తొలిప్రేమ సినిమా సమయంలో.. ఖుషి మూవీని ఎంత బాధ్యతగా చేశామో.. ఈ సినిమాను కూడా అంతే బాధ్యతగా చేశాం. ఎంతో కృషి పెట్టి సినిమాను రూపొందించాం. నిర్మాతలు చిన్నబాబు, నాగవంశీ దగ్గరగా ఉండి.. నా రాజకీయ వ్యవహరాలకు అనుగుణంగా సినిమాను తీసి.. నాకు సహకారం అందించారు అని పవన్ కల్యాణ్ తెలిపారు.

సాగర్ చంద్ర బలమైన దర్శకుడిగా

సాగర్ చంద్ర బలమైన దర్శకుడిగా

సినిమా అంటే.. ఎంత మంది యువశక్తి బయటకు వస్తారో అనే విషయం దర్శకుడు సాగర్ కే చంద్రను చూస్తే స్పష్టమవుతుంది. అమెరికాలో ఉండే సాగర్ చంద్ర చిత్రపరిశ్రమకు వచ్చి ప్రస్తుతం బలమైన దర్శకుడిగా రూపొదిద్దుకొంటున్నారు. అందుకు ఆయనకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బలమైన సంగీతం అందిస్తున్న ఎస్ తమన్‌కు థ్యాంక్స్. మారుమూల ప్రాంతంలో ఉండే కళాకారులను చూసినప్పుడు వీళ్లంతా సినిమాల్లోకి వస్తే బాగుంటుంది కదా అనుకొనే వాడిని. అలాంటి కళాకారులను బయటకు తీసుకొచ్చిన సాగర్, తమన్‌ను అభినందిస్తున్నాను. దర్శకుడు సాగర్ చెబితే.. త్రివిక్రమ్ గారు.. దర్శనం మొగిలయ్యతో పాట పాడించడం అదృష్టంగా భావించాలి అని పవన్ కల్యాణ్ చెప్పారు.

రాజకీయ నేతతో సంఘర్షణ

రాజకీయ నేతతో సంఘర్షణ


భీమ్లా నాయక్ సినిమా విషయానికి వస్తే.. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధం. మలయాళం సినిమా అయప్పనమ్ కోషియం సినిమా ఆధారంగా రూపొందించాం. ఒక పోలీస్ అధికారికి, రాజకీయాల్లోకి రాబోతున్న నేతకు మధ్య సంఘర్షణ. ఆ సంఘర్షణకు చాలా మంచిగా రూపుదిద్దిన వ్యక్తి త్రివిక్రమ్. మూలాధారం నుంచి సహస్రాధారం వరకు తోడ్పాటునందించిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన లేకపోతే సినిమా లేదు. ఆయన ప్రతి ఒక్కరిని ముందుండి నడిపించారు. అందుకు ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

Recommended Video

Bheemla Nayak Pre Release : KTR For Pawan Kalyan's Event | Filmibeat Telugu
ఆదరించి.. ఆనందిస్తే చాలా సంతోషం

ఆదరించి.. ఆనందిస్తే చాలా సంతోషం


భీమ్లా నాయక్ చిత్రంలో డేనియల్ శేఖర్‌గా నటించిన రానా గారికి, ఆయన అద్భుత నటన చూపించారు. అలాగే సంయుక్త మీనన్, నిత్య మీనన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు బాగా నటించారు. సాంకేతిక నిపుణులు రవి కే చంద్రన్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్, ఎడిటర్ నవీన్ నూలికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా అందరికి నచ్చేలా ఉంటుంది. నేను ఎప్పుడూ సినిమాను ప్రమోట్ చేయను. ఈ సినిమాను మీరు ఆదరించి ఆనందిస్తే చాలా సంతోషం. ఈ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. జైహింద్ అంటూ పవన్ కల్యాణ్ తన స్పీచ్‌ను ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X