twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బీగ్‌బీకి కరోనాపై పవన్ కల్యాణ్ ఎమోషనల్.. కూలీ షూటింగ్‌లో గాయపడినప్పుడు అంటూ!

    |

    అమితాబ్ బచ్చన్‌కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన క్షణం నుంచి భారత సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆందోళన చెందుతున్నారు. అన్ని ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిలు అమితాబ్ బచ్చన్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అమితాబ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టుగా పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కూడా అమితాబ్ ఆరోగ్యం పట్ల చింతిస్తూ.. ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు పవర్ స్టార్ చేసిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

    Recommended Video

    Amitabh Bachchan : Celebs Emotional, Twitter Prays | Pawan Kalyan Emotional Tweet || Oneindia Telugu
    బచ్చన్ ఫ్యామిలీకి కరోనా..

    బచ్చన్ ఫ్యామిలీకి కరోనా..

    అమితాబ్ బచ్చన్ తనకు కరోనా సోకిందని నిన్న రాత్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు, అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని హాస్పిటల్ జాయిన్ అయ్యామని తెలిపాడు. అయితే తన ఫ్యామిలీ మెంబర్స్ (ఐశ్వర్యా బచ్చన్, జయా బచ్చన్, ఆరాద్య)లకు ఇంకా ఫలితం వెలువడలేదని పేర్కొన్నాడు.

    అమితాబ్‌పై ఎమోషనల్..

    అమితాబ్‌పై ఎమోషనల్..

    అమితాబ్ ఆరోగ్యంపై చింతిస్తూ.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.‘మాకు ఎంతో ప్రియమైన అమితాబ్ బచ్చన్ గారికి.. మీకు కూలీ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం గురించి తెలిసినప్పుడు మేమంతా ఆందోళనకు గురయ్యాము. మా అమ్మ నాన్న మా ఫ్యామిలీ మొత్తం మీ కోసం ప్రార్థనలు చేశాం. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది.

    ఎంతగానో ప్రేమిస్తాం..

    ఎంతగానో ప్రేమిస్తాం..

    మీరు ఎల్లప్పుడూ అమితమైన ప్రేమ, విధేయత, ఆప్యాయతను చూపిస్తూనే ఉన్నారు. మీ ప్రతిభను మాత్రమే కాదు.. మీకు గల పోరాడే శక్తి, సింప్లిసిటీ, గర్వంలేని ఉదార స్వభావం వల్లే మేమంతా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం.

    ఆ ధన్వంతరి సాయం..

    ఆ ధన్వంతరి సాయం..

    మీకు, అభిషేక్ బచ్చన్ గారికి కరోనా సోకిందనే వార్త విన్నాక నాకు ఎంతో బాధ కలిగింది. లార్డ్ ధన్వంతరి ఉన్న శక్తులతో మీకు, అభిషేక్ గారిని నయం చేయాలి. ఎంతో ఆరోగ్యంగా మీరు తిరిగి రావడం నేను చూడాలని అనుకుంటున్నాను'అని పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశాడు.

    వారికి నెగిటివ్..

    వారికి నెగిటివ్..

    బచ్చన్ ఫ్యామిలీలో ఐశ్వర్యా రాయ్, జయా బచ్చన్, ఆరాద్యలకు నెగెటివ్ రావడం కొంత ఊరటనిచ్చే అంశం. అయితే వారు ఉండే ఏరియాను మాత్రం కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ప్రస్తుతం వీరంతా క్వారంటైన్‌కు పరిమితం కావాల్సి ఉంది.

    English summary
    Power Star Pawan Kalyan emotional tweet amid Amitabh Bachchan' coronavirus tested positive. He wrote in twitter that, I still remember, so vividly, when my entire family including my mother and father prayed for your well being, when you got injured in Coolie shoot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X