Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బీగ్బీకి కరోనాపై పవన్ కల్యాణ్ ఎమోషనల్.. కూలీ షూటింగ్లో గాయపడినప్పుడు అంటూ!
అమితాబ్ బచ్చన్‌కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన క్షణం నుంచి భారత సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆందోళన చెందుతున్నారు. అన్ని ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిలు అమితాబ్ బచ్చన్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అమితాబ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టుగా పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కూడా అమితాబ్ ఆరోగ్యం పట్ల చింతిస్తూ.. ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు పవర్ స్టార్ చేసిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
Recommended Video
బచ్చన్ ఫ్యామిలీకి కరోనా..
అమితాబ్ బచ్చన్ తనకు కరోనా సోకిందని నిన్న రాత్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు, అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని హాస్పిటల్ జాయిన్ అయ్యామని తెలిపాడు. అయితే తన ఫ్యామిలీ మెంబర్స్ (ఐశ్వర్యా బచ్చన్, జయా బచ్చన్, ఆరాద్య)లకు ఇంకా ఫలితం వెలువడలేదని పేర్కొన్నాడు.
అమితాబ్‌పై ఎమోషనల్..
అమితాబ్ ఆరోగ్యంపై చింతిస్తూ.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.‘మాకు ఎంతో ప్రియమైన అమితాబ్ బచ్చన్ గారికి.. మీకు కూలీ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదం గురించి తెలిసినప్పుడు మేమంతా ఆందోళనకు గురయ్యాము. మా అమ్మ నాన్న మా ఫ్యామిలీ మొత్తం మీ కోసం ప్రార్థనలు చేశాం. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది.
ఎంతగానో ప్రేమిస్తాం..
మీరు ఎల్లప్పుడూ అమితమైన ప్రేమ, విధేయత, ఆప్యాయతను చూపిస్తూనే ఉన్నారు. మీ ప్రతిభను మాత్రమే కాదు.. మీకు గల పోరాడే శక్తి, సింప్లిసిటీ, గర్వంలేని ఉదార స్వభావం వల్లే మేమంతా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం.
ఆ ధన్వంతరి సాయం..
మీకు, అభిషేక్ బచ్చన్ గారికి కరోనా సోకిందనే వార్త విన్నాక నాకు ఎంతో బాధ కలిగింది. లార్డ్ ధన్వంతరి ఉన్న శక్తులతో మీకు, అభిషేక్ గారిని నయం చేయాలి. ఎంతో ఆరోగ్యంగా మీరు తిరిగి రావడం నేను చూడాలని అనుకుంటున్నాను'అని పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశాడు.
వారికి నెగిటివ్..
బచ్చన్ ఫ్యామిలీలో ఐశ్వర్యా రాయ్, జయా బచ్చన్, ఆరాద్యలకు నెగెటివ్ రావడం కొంత ఊరటనిచ్చే అంశం. అయితే వారు ఉండే ఏరియాను మాత్రం కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ప్రస్తుతం వీరంతా క్వారంటైన్‌కు పరిమితం కావాల్సి ఉంది.