చంద్రబాబు జోస్యం నిజమైంది.. మోదీ, దేశం ఎవరికి తలవంచదు.. పవన్ కల్యాణ్ ఉద్వేగ ప్రసంగం
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్డీఏ సమావేశంలో ఉద్వేగ భరితంగా చేసిన ప్రసంగం పార్లమెంట్ సభ్యలందరిని ఆకట్టుకొన్నది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. చంద్రబాబును ప్రశంసల ముంచెత్తారు. బీజేపీ నేతృత్వంలో కూటమికి భేషరతు మద్దతు ఉంటుందని అనగా.. సుమారు 290 మంది ఎంపీలు కరతాళ ధ్వనులతో సభను మార్మోగించారు. పవన్ మాట్లాడుతూ..
గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోదీకి జనసేన తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకొంటున్నాను. ఈ సమావేశానికి ఆహ్వానం పంపినందుకు మరోసారి ధన్యవాదలు తెలియజేసుకొంటున్నాను. 2014 సంవత్సరంలో ఇదే కూటమి విజయం సాధించినట్టుగానే ఇప్పుడు కూడా మూడు పార్టీల కలయికలో ప్రభంజనం సృష్టించారు. ఆ సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ మోదీ ఈ దేశానికి 15 ఏళ్లు ప్రధానిగా ఉంటారని చెప్పాడు. అదే ఇప్పుడు నిజం అవుతున్నది అని అన్నారు.

మోదీజీ మీరు దేశానికి నిజమైన స్పూర్తిని అందించారు. మీరు ప్రధానిగా ఉన్నంత వరకు మన దేశం ఎవరికి తలవంచదు. దేశంలోని ఎత్తైన హిమాలయ పర్వతాలు ఎవరికి తలవంచవో.. మీ నేతృత్వంలో దేశం ఎప్పుడూ తల ఎగురేసుకొనే ఉంటుంది. మీ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం నిజంగా గర్వంగా ఉంది అని జనసేనాని అన్నారు.

మీ లీడర్‌షిప్‌లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కామాక్షి నుంచి ద్వారక వరకు మీరు ప్రతీ ఒక్కరికి స్పూర్తిదాయకంగా నిలిచారు. అందుకే మీ వెంట నడిచాం. మీరు చూపిన దేశభక్తి మాకు మార్గదర్శకంగా నిలిచింది. మీ చేతలు, మాటలు, మీరు చేసి అభివృద్ది, వృద్ది ఈ దేశాన్ని పురోగతి చెందేలా చేసింది అని పవన్ కల్యాణ్ అన్నారు.
మీ కూటమిలో భాగస్వాములమైన మా మాట విని.. ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించిన తీరు.. మీ మార్గదర్శకంలో ఎన్నికల్లో పోటీ చేసినందుకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 91 శాతం విజయం సాధించామంటే.. మీ నాయకత్వం, మార్గదర్శకత్వం వల్లే. ఇక ముందు కూడా మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకు జనసేన మద్దతు తెలియజేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











