Renu Desai: రెండో పెళ్లిపై రేణు దేశాయ్ సంచలన కామెంట్స్... ఆమె వల్లే ఆగిపోయిదంటూ...!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వీరు ప్రేమ పెళ్లి చేసుకుని పలు కారణాలతో విడిపోయారు. అయితే రేణు దేశాయ్ వద్దే పవన్ కూతురు ఆద్య, కొడుకు అకీరా పెరుగుతున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి మాట్లాడింది. తనకు రెండో పెళ్లి చేసుకోవాలని ఉన్నా... ఆమె వల్లే ఆగిపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
హీరోయిన్ రేణు దేశాయ్ బద్రీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా పవన్ కల్యాణ్ ప్రేమలో పడిపోయి.. కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ఇక పవన్ కల్యాణ్ ను పెళ్లాడింది. కొన్నేళ్లు బాగానే ఉన్న ఈ జంట.. ఆ మధ్య విడాకులు తీసుకుంటున్న ప్రకటించి షాకిచ్చారు. అయితే పవన్ కూతురు ఆద్య, కొడుకు అకీరా నందన్... మాజీ భార్య రేణు దేశాయ్ వద్దే ఉంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ మూడో పెళ్లి చేసుకుని ఉంటున్నారు.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్.. తన పిల్లల గురించి వీడియోలు, ఫోటోలు, విషయాలు పంచుకుంటూ ఉంటుంది. ఆద్య, అకీరా ఫోటోలు పెడుతూ ఉంటుంది. ఇక ఇటీవల అకీరా నందన్ ఫోటోలు చూసి.. అంతా వింటేజ్ పవన్ కల్యాణ్ అంటూ కామెంట్స్ చేశారు. జూనియర్ పవన్ కల్యాణ్ లాగా ఉన్నాడు అంటూ ట్రెండింగ్ చేశారు. ఇక రేణు దేశాయ్ ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్న రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి చెప్పుకువచ్చింది. నాకు తోడు ఉండాలని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా మంది చెప్పారు. నేను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా కూతురు యంగ్ వయసులో ఉంది. ఒకవేళ నేను ఎవరినైనా చేసుకుంటే.. నేను అతనికి టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నా కూతురికి నాకు మధ్య గ్యాప్ పెరగవచ్చు. ఎలాగూ ఓ పేరెంట్ తన వద్ద లేరు. ఇప్పుడు మరో పేరెంట్ కూడా లేకపోతే... అందుకే నేను రెండో పెళ్లి చేసుకోలేదు.

నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆధ్య కోసమే నేను రెండో పెళ్లి చేసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకుని చాలా సంవత్సరాలు అవుతుంది. పెళ్లంటే నాకు గౌరవం ఉంది. అది ఒక పండగ లాంటింది. నేను రెండో పెళ్లి చేసుకోవాలని ఇద్దరు పిల్లలు అనుకుంటున్నారు. అకీరా అయితే చేసుకోమని చెప్పాడు. నాన్న చేసుకున్నప్పుడు నువ్వేందుకు చేసుకోవు అంటూ చెప్పుకువచ్చాడు. కానీ నేను పర్సనల్ గా ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ వెల్లడించింది.
ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రేణు... ఇటీవల మాస్ మహారాజ్ రవితేజతో కలిసి టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించింది. ఎన్నోఏళ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చినా.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ రేణు దేశాయ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. రేణు దేశాయ్ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తుందని తెలుస్తోంది. ఇక అకీరా మ్యూజిషియన్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఇప్పటికే చెప్పుకువచ్చింది.


Click it and Unblock the Notifications











