పావలా శ్యామలకు...పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసును, ఉదారతను చాటుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల కూతురు వైద్యం కోసం రూ. 75,000 చెక్ ఇవ్వడంతో పాటు, అపోలో ఆసుపత్రి వర్గాలకు ఫోన్ చేసి తాను ఖర్చులు భరిస్తానని చెప్పినట్లు తెలిసింది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ఇటీవల గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో పవర్ స్టార్‌ను కలిసి తన కూతురు అనారోగ్యం, వైద్యానికి అయ్యే ఖర్చుల గురించి చెప్పగానే.....కరిగి పోయిన పవర్ స్టార్ మరో ఆలోచన లేకుండా చెక్ అందించాడు. పవర్ స్టార్‌ను ఒక ఐకాన్‌గా తీసుకుని క్రమశిక్షణ, దేశభక్తి, సింప్లిసిటీ, అంకిత భావం తదితర విషయాల్లో ఆయన్ను ఆదర్శంగా తీసుకునే అభిమానులు వపర్ స్టార్ ఉదారతను చూసి మరింత పొంగి పోతున్నారు. అవసరం అయితే వారి అభిమానులుగా ఆర్థిక సాయం చేయడానికి ముందు వస్తామంటున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' చిత్రంలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్వకత్వం వహిస్తున్న ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేశి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇటీవలే విడుదలై సూపర్ హిట్టయింది.
ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటించబోతున్నారు. ఈచిత్రంలో తమన్నాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.


Click it and Unblock the Notifications











