జనసేనతో చేతులు కలిపిన మెగా ఫ్యామిలీ.. ఆ రైతుల కుటుంబాల కోసం విరాళాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన జనసేన ప్రయాణంలో ఎంతో మంది సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మెగా ఫ్యామిలీలో చాలావరకు విభేదాలు ఉన్నాయని బయట తప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ తో మాత్రం ఆ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా సాన్నిహిత్యంగానే ఉంటుంది అని మరో సారి రుజువైంది. పవన్కళ్యాణ్ చేస్తున్న కొన్ని మంచి పనులలో కూడా వారు బాగామవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్లో చాలామంది కౌలు రైతులు ఆర్థిక కారణాల వలన అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ ఇటీవల నిధులు కూడా సేకరించడం మొదలుపెట్టాడు. జనసేన తరఫున సహాయం చేయడమే కాకుండా ఇతరులతో కూడా ఆయన వారికి సహాయం అందే విధంగా అడుగులు వేస్తున్నారు.

pawan kalyan family members donates 35 lakhs in support of farmers families

ఇక రీసెంట్ గా మెగా ఫ్యామిలీ లోని కొందరు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున వారికి సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు. మెగా హీరో వరుణ్ తేజ్ 10 లక్షల విరాళం ఇవ్వగా మెగా డాటర్ నిహారిక ఐదు లక్షల రూపాయలను అందజేశారు. అలాగే సాయిధరమ్ తేజ్ 10 లక్షలు ఇవ్వగా అతని సోదరుడు వైష్ణవ్ తేజ్ 5 లక్షల రూపాయలు అందజేశారు. ఇలా మొత్తంగా మెగా ఫ్యామిలీ నుంచి కౌలు రైతుల కుటుంబాల కోసం 35 లక్షల విరాళం అందినట్లు సమాచారం.

ఇటీవల నాగబాబు ప్రత్యేకంగా అందుకు సంబంధించిన చెక్కు ను కూడా పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఇక పవన్ కళ్యాణ్ కు అధికారం దక్కక పోయినప్పటికీ కూడా తనవంతు సహాయంగా రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇదివరకే చాలా మందికి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవలేకపోయినా కూడా తను అనుకున్న పనిని అనుకున్నట్లుగా పూర్తి చేస్తున్నాడు. ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలుస్తాడాని తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో నాగబాబు కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X