»   » పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ వెకేషన్... అంతా రహస్యమే!(ఫ్యామిలీ ఫోటోస్)

పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ వెకేషన్... అంతా రహస్యమే!(ఫ్యామిలీ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య అసలు ఫ్రీగా ఉండటమే లేదు. ఓ వైపు రాజకీయాలు, మరో వైపు సినిమాలు ఇలా ఆయన కొన్ని సందర్భాల్లో ఊపిరి సలపనంత బిజీగా గడుపుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన ఫ్యామిలీతో కలిసి సరదాగా వెకేషన్ వెళ్లిన సందర్భం అసలు లేదనే చెప్పాలి.

'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం అలా రిలీజైందో లేదో... ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తన తర్వాతి సినిమా ప్రారంభించారు పవన్ స్టార్. సినిమా ఒక్కసారి మొదలైందంటే మళ్లీ బిజీ బిజీ జీవితమే. ఇక షూటింగ్ మధ్యలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడం కష్టమే. సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు దాదాపుగా పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడపాల్సిన పరిస్థితి.

'నేను శత్రువు మీద చేసే యుద్ధం' పవన్ కళ్యాణ్ అంటున్న త్రివిక్రమ్!

ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం జూన్ నెలలో ప్రారంభం కాబోతోంది. సినిమా ప్రారంభం కావడానికి మరో నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఈ గ్యాపులో ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్ చేసారు పవర్ స్టార్. తన మూడో భార్య అన్నా లెజెనివా, కూతురు పోలెనాతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు రెండో భార్య రేణు దేశాయ్ ద్వారా కలిగిన సంతానం అకీరా, ఆద్యలను కూడా తీసుకెళ్తారా? అనేది తెలియదు.

మరో వైపు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో వెకేషన్ ఎక్కడికి వెలుతున్నారు? అనే విషయాలు కూడా రహస్యంగా ఉంచారు. స్లైడ్ షోలో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటోస్...

పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ

పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ

పవన్ కళ్యాణ్ అన్నా లెజెనివా అనే విదేశీ యువతిని మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

పవన్ కూతురు

పవన్ కూతురు

పవన్ కళ్యాణ్-అన్నా లెజెనివా దంపతుల కుమార్తె పోలెనా

అన్నా లెజెనివా

అన్నా లెజెనివా

పవన్ కళ్యాణ్, అన్నా లెజెనివా ప్రేమ వివాహం చేసుకున్నారు. అసలు వీరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యం.

అకీరా, ఆద్య

అకీరా, ఆద్య

పవన్ కళ్యాణ్, ఆయన రెండో భార్య రేణు దేశాయ్ సంతానం అకీరా, ఆధ్య. ప్రస్తుతం వీరు పూణెలో తల్లి వద్దే పెరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ తరచూ వెళ్లి కలిసి వస్తున్నారు.

English summary
Pawan is planning to fly off for a family vacation soon during this free time. It's going to be a strict family affair. The place of vacation, itinerary and the schedule is kept under the wraps as usual.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu