పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఆత్మహత్య, పవర్ స్టార్‌కు లేఖ!
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. పవర్ స్టార్ వీరాభిమాని అయిన కొమరవల్లి అనిల్ కుమార్ నగరంలోని తల్‌వాకర్స్ జిమ్‌లో ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్న అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే చనిపోయే ముందు అనిల్ కుమార్ రాసిన లేఖ చర్చనీయాంశం అయింది. ఈ లేఖను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని అందులో రాసి ఉంది. నా ఆత్మశాంతించాలంటూ పవన్ కళ్యాణ్ సమక్షంలో తన అంత్యక్రియలు జరుగాలని, బ్రతికుండగా నేను నిన్ను చూడలేక పోయాను, నువ్వు వస్తావని ఆశిస్తున్నాను... మీ పిచ్చి అభిమాని అనిల్ కుమార్ అని ఆ లేఖలో ఉంది.

అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లిందా? లేదా? అనే అంశం తెలియాల్సి ఉంది. మరో వైపు అనిల్ కుమార్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. విభజన తర్వాత ఏపీ ప్రజలకు అన్యాయం జరిగిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న వారి వల్ల న్యాయం జరుగడం లేదని, మార్పు రావాల్సిన అవసరం ఉందని, అందుకోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న ఆయనకు ప్రజలు, అభిమానుల నుండి మద్దతు లభిస్తోంది.


Click it and Unblock the Notifications