చెమటలు పట్టించిన పవన్ అభిమాని.. చేతులో ఏదో పట్టుకుని రావడంతో..

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు మరే హీరోకూ ఉండరన్న అభిప్రాయం ఉంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, తరచూ వాళ్లే హాట్ టాపిక్ అవుతుండడం కూడా ఒక కారణమే. తమ అభిమానాన్ని చాటుకోవడం కోసం చాలా మంది తహతహలాడుతుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో చిత్ర విచిత్ర పనులు చేస్తూ ఉంటారు. ఇక, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయింది.

పవన్‌ను పట్టుకోవాలనో.. దగ్గర నుంచి చూడాలనే.. ఆయన దృష్టిలో పడాలనో ఎంతో మంది అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయనను కూడా ఇబ్బంది పెడుతుంటారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఇవి తరచూ కనిపించేవి. విజయనగరంలోని అయోధ్య మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్... ప్రసంగం మొదలెట్టిన కొద్దిసేపటికే ఓ అభిమాని హఠాత్తుగా వచ్చి, పవన్ కల్యాణ్ కాళ్ల మీద పడిపోయాడు. దీంతో పవన్ కింద పడిపోయాడు.

Pawan Kalyan fan Hulchal in Meeting

అంతకుముందు విజయవాడలో ప్రచారం నిర్వహించిన సమయంలో కూడా పవన్ కల్యాణ్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సభ మీద పవన్ మాట్లాడుతున్న సమయంలో వేదిక పైకి దూసుకొచ్చిన ఓ అభిమాని... పవన్ కల్యాణ్ కాళ్ల మీద పడిపోయాడు. అయితే అప్పుడు పవన్ కల్యాణ్ పడబోయి, తేరుకుని నిలబడ్డాడు.

ఇక, తాజాగా భీమవరంలో జరిగిన మీటింగ్‌లో ఓ అభిమాని చేతిలో ఏదో పట్టుకుని స్టేజ్ పైకి దూసుకొచ్చాడు. దీంతో అంతా భయపడిపోయారు. అయితే, పవన్ మాత్రం ఏమాత్రం టెన్షన్ పడకుండా అతడితో మాట్లాడాడు. అంతేకాదు, సదరు అభిమానితో ఓ బ్యాండ్ కట్టించుకున్నాడు. దీంతో ఈ ఘటన హాట్ టాపిక్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X