Prabhas Pawan Kalyan: దారుణం..ప్రాణం తీసిన ఫ్యాన్స్ గొడవ..పవన్ కల్యాణ్ అభిమాని హతం

హీరోలు అంటే అభిమానులకు ప్రాణం. ఎనలేని ప్రేమ. వారికోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడతారు. అయితే ఒక్కోసారి వారి ప్రేమ హద్దులు దాటుతుంది. తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమతో ఇతరులకు ఎలాంటి నష్టం కలుగుతుందనేది ఆలోచించట్లేదు ఫ్యాన్స్.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరూ అంటే అభిమానులకే కాదు సగటు సినీ ప్రేక్షకుడికి ఇష్టమే. అలాంటిది వీరి ఫ్యాన్స్ మధ్య గొడవ ఒక ప్రాణం తీసే వరకు వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Pawan Kalyan Fan Killed By Prabhas Fan In Attili

స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవలు, వార్ లు సర్వసాధారణం. ఆ అగ్ర హీరోల మధ్య లేని మనస్పర్థలు, గొడవలు అభిమానుల్లో ఎక్కువగా ఉంటాయి. సినీ కథానాయకులు వాళ్లు స్టేజీలు, షోలు, పోగ్రామ్స్ లలో కలిసినప్పుడు సంతోషంగా మాట్లాడుకుంటూ సందడి చేస్తారు. కానీ వారి ఫ్యాన్స్ మాత్రం తమ హీరో గొప్పంటే.. తమ హీరో గ్రేట్ అంటూ కయ్యానికి కాలు దువ్వుతుంటారు. ఒక్కోసారి ఈ పోటీ హద్దులు దాటుతుంటుంది. ఫలితంగా ఎంతో నష్టం జరుగుతుంటుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో ఇద్దరు ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ హత్యకు కారణమైంది. కిషోర్, హరి కుమార్ ఇద్దరు కూలీలు. పెయింటింగ్ వేసే పని చేస్తుంటారు. ఈ పెయింటింగ్ పని నిమిత్తం ఏలూరు నుంచి అత్తిలి మసీదు వీధులోని నజీన్ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు. పని ముగించుకుని అదే బిల్డింగ్ లో నిద్రించే సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. పెయింటర్ హరి కుమార్ ప్రభాస్ అభిమాని. కిశోర్ ఏమో పవన్ కల్యాణ్ ఫ్యాన్.

ప్రభాస్ వీడియోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు అభిమాని అయిన హరి కుమార్. ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయిన కిశోర్ నేను పీకే అభిమానిని, నువ్వు కూడా ప్రభాస్ వీడియో తీసి పవన్ వీడియోను స్టేటస్ గా పెట్టుకో అని హరి కుమార్ కు చెప్పాడు. అందుకు హరి కుమార్ ఒప్పుకోలేదు. నేను ప్రభాస్ వీడియోనే పెట్టుకుంటానని తేల్చి చెప్పాడు. చిన్నగా మొదలైన ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లింది.

ఇక మద్యం మత్తులో ఊగిపోయిన హరి కుమార్ సెంట్రింగ్ కర్రతో తలపై బలంగా కొట్టాడు. సిమెంట్ రాయితో ముఖంపై కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కిశోర్ అక్కడికక్కడే చనిపోయాడు. అక్కడి నుంచి పారిపోయిన హరి కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తాజాగా సమాచారం అందింది. ఈ సంఘటన తెలుసుకున్న స్థానికులు విస్తుపోయారు. అభిమానం ఉండొచ్చు గానీ మరి ప్రాణాలు తీసుకునేంతగా ఉండాల అని పలువురు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X