సబ్ కలెక్టర్‌గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్.. ఒకప్పుడు పంజా ఆడియో వేడుకలో ఇలా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు వింటే చాలు అభిమానులకు ఒక తెలియని ఉత్సాహం కలుగుతుంది. ఎవరో కొంత మంది చేసిన తప్పులకు అభిమానులందరిని తిట్టడం విజ్ఞానం లేని వాళ్లకు అలవాటే. అలాంటి వారికి కౌంటర్ ఇచ్చేలా ఒక వీడియో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన ఒక కుర్రాడు సబ్ కలెక్టర్ గా బాద్యతలు తీసుకోవడం ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.

 నిజమైన స్టార్..

నిజమైన స్టార్..

ఎన్ని అపజయాలు వచ్చినా కూడా ఒక స్టార్ హీరోకి ఉన్న క్రేజ్ అనువంతైనా తగ్గలేదు అంటే అతని వ్యక్తిత్వానన్నీ అభిమానులు ఎంతగా ఇష్టపడుతున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ చేసే సహాయలు అతను స్పంధించే తీరుపై రెండు తరాల జనరేషన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. అందుకే అత్యధిక అభిమానుల్ని సంపాదించుకున్నారు.

పంజా వేడుకలో ఐఐటీ టాపర్..

పంజా వేడుకలో ఐఐటీ టాపర్..

పవన్ కళ్యాణ్ అంటే ఎలాంటి వారైనా ఇష్టపడతారు అనేందుకు ఈ వీడియో సాక్ష్యంగా నిలిచింది. 2011లో పంజా సినిమా ఆడియో వేడుకలో ఊహించని విధంగా ఆ ఇయర్ ఐఐటీ టాపర్ పృథ్వి తేజ్ పవన్ ని వేదికపై కలుసుకున్నాడు. పవన్ అప్పుడు అతనిని గోల్డ్ మెడల్ తో సత్కరించాడు. పృథ్వి కాళ్ల మీద పడుతుండగా.. వద్దని చెబుతూ పవన్ కౌగిలించుకొని అభినందించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

పవన్ ఆకాంక్ష..

పవన్ ఆకాంక్ష..

పవన్ కళ్యాణ్ పంజా ఆడియో వేడుకలోనే పృథ్వి తేజ కోసం ప్రత్యేకంగా మాట్లాడాడు. అతను ఉన్నత శిఖరాలను అధిరోహించాలని. ఈ విషయం మనందరికీ చాలా గర్వించదగిన విషయమని పవన్ కళ్యాణ్ ఆకాక్షించారు. అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. పంజా నిర్మాత నీలిమ శెట్టి కూడా పృథ్వి తేజను అభినందిస్తూ రీసెంట్ గా ట్వీట్ చేశారు.

Recommended Video

#8YrsOfGabbarSingh: Then World Wide Box Office Collections, Now Twitter Records

సబ్ కలెక్టర్ గా పవన్ ఫ్యాన్..

ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడానికి కారణం పృథ్వి తేజ్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోవడమే. తొమ్మిదేళ్ల తరువాత ఆ యువకుడు మదనపల్లె సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడంతో అభిమానులు గర్వంగా ఉందని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. పృథ్వి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ లో 24వ ర్యాంక్ సాధించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X