పంజాలో పవన్ స్టైల్ లో ‘పాపారాయుడు....’ అంటూ పాట...
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'పంజా ఆడియో ట్రాక్ లిస్ట్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే..ఈ ట్రాక్ లిస్ట్ ని గమనిస్తే ఈ సినిమాలో పవన్ కళ్యాన్ ఓ పాట పాడిన విషయం తెలిసిపోతుంది. 'జానీ" చిత్రంలో పాట పాడిన పవన్ కళ్యాణ్, మళ్ళీ ఈ సినిమా కోసం పాట పాడాడు.
'పాపారాయుడు..."అంటూ పవన్ స్టైల్ లో సాగే పాటను పవన్ కళ్యాణ్ తో పాటు బ్రహ్మానందం కూడా పాడాడని తెలుస్తోంది. మరి రేపు గచ్చిబౌలీ స్టేడియంలో విడుదలవుతున్న ఈ సినిమా ఆడియో ఏ మేరకు ప్రేక్షకాదరణ పొందుతుందో? అందులోనూ పవన్ పాడిన పాట ఏ రేంజ్ లో హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే...
ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన అంజలి లావెనియా మరియు సారా జేన్ డయాస్ హీరోయిన్లు గా నటించారు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ ఈ చిత్రానికి దర్సకత్వం వహించారు. పంజా చిత్రాన్ని నీలిమ తిరుమల సెట్టి మరియు శోభు యార్లగడ్డ సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరు 9 వ తారీకున భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, సంగీతం: యువన్‌శంకర్ రాజా, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: పీఎస్ వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు.


Click it and Unblock the Notifications











