Don't Miss!
- News మాజీ సీఎం రిలీఫ్, హైకోర్టు ఆదేశాలు, మహిళలనపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు !
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పవన్ దయవల్లే, ఆయన దేవుడు, సర్దార్ చూస్తా: శ్రీజ
హైదరాబాద్: ఆ మధ్య పవన్ కళ్యాణ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న తన అభిమానిని శ్రీజను స్వయంగా కలిసి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆమె ఆపరేషన్ కోసం పవన్ ఆర్థిక సహాయం కూడా అందజేసారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతురాలై సంతోషంగా జీవిస్తోంది.
శ్రీజ కోలుకున్న తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ సినిమా కోసం ఆమె ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటూ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
అనారోగ్యంగా ఉన్నప్పుడు తన వద్దకు వచ్చి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్ శ్రీజ మరోసారి కృతఙ్ఞతలు తెలిపారు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగుందని, రేపు విడుదల కానున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించాలని తిరుమలను దర్శించుకున్నట్లు తెలిపారు. రేపు తిరుపతిలోనే సినిమా చూస్తానన్నారు. శ్రీజ తండ్రి మాట్లాడుతూ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దయవల్లే తన కూతురు క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిందని పేర్కొన్నారు.
తమ బిడ్డ ప్రాణాలు నిలిచేలా చేసిన పవన్ కల్యాణ్ తమకు దేవుడితో సమానమని, ఆ దేవుడే ఈ దేవుడి రూపంలో వచ్చాడన్నారు. అదేవిధంగా తమ బిడ్డ ప్రాణాలు నిలబెట్టినటువంటి డాక్టర్ కి, పవన్ కల్యాణ్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.
స్లైడ్ షోలో గతంలో పవణ్ కళ్యాణ్‌ను శ్రీజ కలిసిన ఫోటోస్...
శ్రీజ
శ్రీజ కోలుకున్న తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ సినిమా కోసం ఆమె ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
సర్దార్ చూస్తా
ఇప్పుడు తన ఆరోగ్యం బాగుందని, రేపు విడుదల కానున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని చూస్తానని చెప్పింది.
ఆయన దయవల్లే..
పవర్
స్టార్
పవన్
కల్యాణ్
దయవల్లే
తన
కూతురు
క్యాన్సర్
వ్యాధి
నుంచి
బయటపడిందని
పేర్కొన్నారు.
దేవుడు
తమ బిడ్డ ప్రాణాలు నిలిచేలా చేసిన పవన్ కల్యాణ్ తమకు దేవుడితో సమానమని, ఆ దేవుడే ఈ దేవుడి రూపంలో వచ్చాడన్నారు.