పవర్ స్టార్ అభిమాని చర్యకు షాక్ అయిన దిల్ రాజు.. ఎంత చెప్పినా వినకుండా..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా రెండు వేలకు పైగా థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా మొత్తానికి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను అందుకుంది. మూడేళ్ళ అనంతరం పవర్ స్టార్ ను వెండితెరపై చూడడంతో అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఇక వకీల్ సాబ్ సినిమా చేస్తుండగా ఒక అభిమాని చర్యకు దిల్ రాజు షాక్ అయ్యాడు.

ఆ రెండు సినిమాల తరువాత

ఆ రెండు సినిమాల తరువాత

నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్ తో సినిమా చేయాలని కెరీర్ మొదటి నుంచి ఎంతగానో ట్రై చేస్తున్నాడు. తొలిప్రేమ, ఖుషి వంటి సినిమాలతో డిస్ట్రిబ్యూటర్ గా మంచి లాభాలు అందుకున్న దిల్ రాజు పవన్ కళ్యాణ్ కోసం చాలాసార్లు కథలపై చర్చలు జరిపారు. కానీ నమ్మకం కలిగే వరకు ఆయన డేట్స్ తీసుకోవద్దని అనుకున్నాడు.

అలా గ్రీన్ సిగ్నల్ దొరికింది

అలా గ్రీన్ సిగ్నల్ దొరికింది

ఇక పింక్ సినిమాను తమిళ్ లో అజిత్ తో రీమేక్ చేసిన అనంతరం దిల్ రాజు ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్ పైనే పడింది. వీలైనంత త్వరగా ఈ సినిమాను పవన్ తో తెరకెక్కించాలని అనుకున్నాడు. ముందుగా రీమేక్ రైట్స్ తీసుకొని త్రివిక్రమ్ ద్వారా పవన్ కళ్యాణ్ ను సంప్రదించడంతో గ్రీన్ సిగ్నల్ దొరికింది.

క్లారిటీగా అర్ధమయ్యింది

క్లారిటీగా అర్ధమయ్యింది

ఇక వేణు శ్రీరామ్ కు ఈ ప్రాజెక్టును అప్పగిస్తారని ఎవరు ఊహించలేదు. తన టీమ్ లో ఉండే దర్శకుల ప్రతిభపై ఎంతగానో అవగాహన ఉన్న దిల్ రాజు మొత్తానికి దర్శకుడిని నమ్మి మూడవసారి ఛాన్స్ ఇచ్చాడు. ఇక పవన్ కూడా దర్శకుడి మేకింగ్ కు ఫిదా అయ్యారు. ఇక సినిమా రిలీజైన అనంతరం దిల్ రాజు నమ్మకం ఎంత బలమైందో క్లారిటీగా అర్ధమయ్యింది.

పేపర్లు ఎగరేసిన దిల్ రాజు

పేపర్లు ఎగరేసిన దిల్ రాజు

సినిమా విడుదల తరువాత అభిమానులు దిల్ రాజు ప్రయత్నానికి ఫిదా అవుతున్నారు. ఇక ఇటీవల తన భార్యతో కలిసి సినిమా చూసిన దిల్ రాజు ఒక సాధారణ అభిమానిలా మారి పేపర్లు ఎగరేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recommended Video

Vakeel Saab Shows Cancelled, Pawan Kalyan’s Fans Angry | Filmibeat telugu
అభిమాని చర్యకు షాక్

అభిమాని చర్యకు షాక్

ఇక అప్పుడే ఒక అభిమాని చర్యకు దిల్ రాజు షాక్ అయ్యాడు. మా కల నిజం చేశావ్ అంటూ ఒక అభిమాని దిల్ రాజు కాళ్ల మీద పడిపోయాడు. కొంతసేపటి వరకు అతను పైకి లేవలేదు. దిల్ రాజు సన్నిహితులు అతన్ని పైకి లేపడంతో దిల్ రాజు అతన్ని కూల్ చేశాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X