బాబాయ్‌కి ఇంద్ర-బుడ్డోడికి మగధీర-ఫ్యామిలీకి పంజా దెబ్బ
మెగా, నందమూరి అభిమానుల మధ్య కోల్డ్ వార్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. మొన్న కోదాడలో పవన్ అభిమానులు 'తాతల నాటి చరిత్ర చెప్పుకునే ఆలోచన మాది కాదని, చరిత్ర సృష్టించే చరిత్రలే భావితరాలకు భగవద్గీత' అంటూ ఏర్పాటు చేసిన వివాదం ఇంకా మరువనే లేదు విజయవాడలో మరో రెండు ప్లెక్సీలు వెలిశాయి. మా స్పీడుకి ఇండస్ట్రీలో బ్రేక్ వెయ్యిలేకపోయాడు..క్షణానికో రంగు మార్చే మీ దూకుడెంతరా అంటూ ఈ రోజు ఉదయం ప్లెక్సీ వెలుగు చూసిన విషయం విధితమే. తాజాగా మరో ప్లెక్సీ వెలుగులోకి వచ్చింది.
తాతకు తెలుసు ఖైదీ దెబ్బ..
బాబాయ్ కి తెలుసు ఇంద్ర దెబ్బ..
బుడ్డోడికి తెలుసు మగధీర దెబ్బ..
ఇప్పడు టోటల్ ఫ్యామిలీని రుచి చూస్తారు పంజా దెబ్బ..
అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్లెక్సీ పై నందమూరి అభిమానులు ఆగ్రమం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ జమానాకు చిరంజీవి తన ఖైదీ సినిమా ద్వారా బ్రేక్ వేశాడని, బాలయ్య ఇంద్ర సినిమా దెబ్బకి, జూనియర్ ఎన్టీఆర్ మగధీర దెబ్బకి కోలుకోలేక పోయారని పరోక్షంగా మా హీరోలను అవమానించే విధంగా ఉందని నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్లెక్సీ వివాదాస్పదంగా ఉండటంతో పోలీసులు దాన్ని తొలగించి, అది ఏర్పాటు చేసిన వారిని అరెస్టు చేశారు. అయితే పవన్ అభిమానుల వాదన మరోలా ఉంది. వారి అభిమానులు ప్లెక్సీలు కట్టుకుంటే తప్పులేదుకానీ..మేము కడితే అరెస్టు చేస్తారా? అంటూ మండి పడుతున్నారు.


Click it and Unblock the Notifications











