పవన్ కళ్యాణ్ పేరు లేక పోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్....సౌతిండియాలో పరిచయం అక్కర్లేని పేరు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్లలో ఆయన ఒకరు. ఆయన సినిమా విడుదలైతే అత్యధిక కలెక్షన్లు. ఇన్ని ఉన్నా....ఆయన మెస్ట్ డిజైరబుల్ లిస్టులో చోటు లేదా? అంటూ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్-2014 లిస్టులో ఆయనకు చోటు దక్కక పోవడంపై అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.

అయితే కొందు అభిమానులు మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిని ఇష్టపడరని, ఆయనకు ఎలాంటి పబ్లిసిటీ లేకుండా నిరాడంబరంగా ఉండటమే ఇష్టమని అంటున్నారు. మొత్తానికి పవన్ అభిమానుల్లోనే ఈ విసయంలో మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది.

Pawan Kalyan Fans are angry

టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్-2014 జాబితాలో రానా నెం.1 స్థానం దక్కించుకున్నాడు. సామాన్య ప్రజల నుండి ఓపీనియన్ పోల్ నిర్వహించడం ద్వారా ఈ ఫలితాలు వెల్లడించారు. తెలుగులో రానా, మహేష్ బాబు తర్వాతి స్థానాల్లో ప్రభాస్, నితిన్, ఎన్టీఆర్, అఖిల్ వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాలు దక్కించుకున్నారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 7వ స్థానం, హైదరాబాద్ బాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ 8వ స్థానంలో నిలిచాడు.

ఇక 9వ స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, 10వ స్థానంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచారు. అక్కినేని స్టార్లు నాగ చైతన్య, నాగార్జున 11, 12 స్థానాలు దక్కించుకున్నారు. గతేడాది ఈ లిస్టులో నెం.1 స్థానంలో ఉన్న మహేష్ బాబును ఇపుడు రానా బీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. '

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X