రామ్ చరణ్ తో పోటి పడలేకపోతున్న పవన్ కళ్యాణ్.. ఎందులో...!?

By Sindhu

సినిమాని హైప్ చేసుకునేందుకు నోటికొచ్చిన లెక్కలు చెబుతుంటారు నిర్మాతలు. ముఖ్యంగా ప్రింట్లు, థియేటర్ల విషయంలో తమకు తోచిన నంబర్ చెప్పి అదే నిజమనుకునేలా పదేపదే జనం మీద రుద్దుతారు. వెయ్యి థియేటర్లలో విడుదల చేస్తున్నామని అయిదారొందల ప్రింట్లు పెడుతున్నామని కాకి లెక్కలు చెప్పేస్తారు. వెర్రి అభిమానులు అదంతా నిజమేనని నమ్మేస్తుంటారు. అయితే ప్యూచర్ చూసుకోకుండా ఇలా వేలాది థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తే తర్వాత వచ్చే సినిమాలకు అక్కర్లేని తలనొప్పులు వస్తుంటాయి. 'కొమరం పులి" సినిమాకి ఇప్పుడు అదే సమస్య తలెత్తింది. సెప్టెందర్ 10న విడుదల కానున్న ఈ చిత్రానికి ఎన్ని థియేటర్లు ప్రకటించాలనే విషయంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాదుకుంటున్నారు.

'జల్సా"కి వెయ్యి థియేటర్లని చెప్పుకున్నారు కాబట్టి 'పులి"కి పన్నెండొందలంటే బాగుంటుందేమోనని అనుకున్నారు. కానీ మధ్యలో 'మగధీర" కి పదిహేనొందల థియేటర్లు పెట్టామని డప్పేసుకున్నారు. దానికంటే తక్కువ థియేటర్లు చెబితే పవన్ రేంజ్ చరణ్ కంటే తక్కువా అంటూ పవన్ ఫాన్స్ పైర్ అవుతారు. దాంతో 'పులి"కి కనీసం పదహారొందల థియేటర్లలో విడుదలవుతుందని చెప్పితీరాలి. నోటి మాటలకేం ఎన్నయినా చెప్పొచ్చు కానీ అన్ని థియేటర్ల లిస్ట్ విడుదల చేయమంటేనే కాలుద్ది. సో ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని ఈ మెగా ప్యాన్స్ హైప్ కాస్త తగ్గించుకొంటే మంచిది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X