»   » ఇదిగో ప్రూఫ్: ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్‌‌‌ను ఇష్టపడటం లేదు!

ఇదిగో ప్రూఫ్: ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్‌‌‌ను ఇష్టపడటం లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ మధ్య జనసేన పార్టీని స్థాపించడం తెలిసిందే. పార్టీ లాంచింగ్ సమయంలో వీర లెవల్లో ప్రసంగాలు దంచిన పవన్ కళ్యాణ్.... తాను చెప్పిన విషయాలను, పార్టీని ఎస్టాబ్లిష్ చేసే విషయంలో ఆచరణ క్రమంలో విఫలం అయ్యారనే వాదన కూడా ఉంది.

ఈ అంశంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆన్ లైన్లో ఓ పోల్ నిర్వహించారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తీరుపై మీరు డిసప్పాయింట్ అయ్యారా? అంటూ వర్మ పెట్టిన పోల్ లో 64శాతం మంది ‘అవును' అంటూ సమాధానం ఇచ్చారు. మిగతా 34 శాతం మంది మాతరం మాత్రం కాదు అని సమాధానం ఇచ్చారు. దాదాపు 9400 మందికి పైగా ఈ పోల్ లో పాల్గొన్నారు.

ఈ పోల్ కు వచ్చిన స్పందిన చూసిన రామ్ గోపాల్ వర్మ..... పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ను ఇష్ట పడటం లేదు, ఈ పోల్ అందుకు ఓ ప్రూప్ అంటూ ట్వీట్ చేసారు.

ఇటీవల పవన్ ప్రసంగంపై కూడా విమర్శలు...
కాపులను బీసీల్లో చేర్చాలంటూ జరుగుతున్న ఆందోళనలపై పవన్‌ ఆ మధ్య ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్‌ మాటలు ఆయనకైనా అర్థమయ్యాయా? అని ప్రశ్నించిన వర్మ.. ప్రెస్‌మీట్‌కు వచ్చే సమయంలో కారులో తన పక్కనున్న వ్యక్తి చెప్పిన మాటలతో తీవ్ర ప్రభావానికి లోనై మాట్లాడినట్లుగా పవన్‌ మాటలు ఉన్నాయని వర్మ వ్యాఖ్యానించారు.

ప్రెస్‌మీట్‌ సందర్భంగా పవన్‌ తాను చేసిన ప్రసంగాన్ని మరోసారి చూసుకోవాలని.. ఇది ఆంధ్రప్రదేశ్‌ పౌరుడిగా.. పవన్‌కల్యాణ్‌ అభిమానిగా తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జనసేన పార్టీ ప్రారంభించిన సమయంలో పవన్‌ చేసిన ప్రసంగాన్ని ఆయన మరోసారి చూసుకోవాలని వర్మ సూచించారు. పీకే అభిమానిగా తాను వ్యక్తపరిచిన నిజాలను వ్యతిరేకించే ఏ పవన్‌ కల్యాణ్‌ అభిమాని అయినా తన దృష్టిలో నమ్మకద్రోహిగా వర్మ పేర్కొనటం గమనార్హం. తన ట్వీట్ల పరంపరలో పవన్‌ సోదరుడు చిరంజీవి రాజకీయ వైఫల్యం కంటే పవన్‌ కల్యాణే ఎక్కువగా విఫలమైనట్లు పేర్కొన్నారు.

English summary
Ram Gopal Varma posted a survey, in which nearly 9400+ people have voted. He posed the question, "Honestly speaking isn't Pawan Kalyan progressively disappointing after jana sena launch speech?". Nearly 64% people have voted "yes", saying that they are disappointed with Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu